Alzheimer’s: టెన్షన్ పడకండి.. ఈ చిన్న టిప్స్ తో అల్జీమర్స్ ను కంట్రోల్ లోకి తీసుకు రావచ్చు!

ఎవరికైనా మతి మరుపు ఉండటం సర్వ సాధారణమైన విషయం. చిన్న చిన్న పనులు, వస్తువులను బయటకు వెళ్లే హడావిడలో మర్చిపోతూంటారు. అలాగే షాపింగ్ లకు వెళ్లినప్పుడు కొన్ని వస్తువులను తీసుకోవడం మర్చిపోతాం. కానీ మొత్తానికే కొన్ని విషయాలు, పనులు పూర్తిగా గుర్తుండకపోతే.. దీన్నే అల్జీ మర్స్ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే.. మనచుట్టూ ఉన్న వాళ్లు, మనం ఉన్న ప్లేస్ ఏమీ గుర్తుండవు. అప్పటి వరకూ మన చుట్టూ ఉన్న వాళ్లే ఎవరో తెలీని వ్యక్తుల్లా..

Alzheimer's: టెన్షన్ పడకండి.. ఈ చిన్న టిప్స్ తో అల్జీమర్స్ ను కంట్రోల్ లోకి తీసుకు రావచ్చు!
Alzheimer's
Follow us

|

Updated on: Sep 21, 2023 | 12:36 PM

ఎవరికైనా మతి మరుపు ఉండటం సర్వ సాధారణమైన విషయం. చిన్న చిన్న పనులు, వస్తువులను బయటకు వెళ్లే హడావిడలో మర్చిపోతూంటారు. అలాగే షాపింగ్ లకు వెళ్లినప్పుడు కొన్ని వస్తువులను తీసుకోవడం మర్చిపోతాం. కానీ మొత్తానికే కొన్ని విషయాలు, పనులు పూర్తిగా గుర్తుండకపోతే.. దీన్నే అల్జీ మర్స్ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే.. మనచుట్టూ ఉన్న వాళ్లు, మనం ఉన్న ప్లేస్ ఏమీ గుర్తుండవు. అప్పటి వరకూ మన చుట్టూ ఉన్న వాళ్లే ఎవరో తెలీని వ్యక్తుల్లా కనిపిస్తారు. అల్జీ మర్స్ తో బాధ పడే వారికి అంతా కొత్తగా, గందర గోళంగా ఉంటుంది. ఎవర్ని నమ్మాలో, నమ్మ కూడదో కూడదో తెలీని పరిస్థితిలో వాళ్లు ఉంటారు.

పూర్వంలో 60 ఏళ్లకు పైబడ్డ వాళ్లలోనే అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు కనిపించేవి. కానీ ఇప్పుడు మన దేశంలో 30 మందిలో ప్రతీ ఒక్కరు అల్జీమర్స్ తో బాధ పడుతున్నట్టు పలు అధ్యయనాల్లో తేలింది. అది కూడా మహిళలలే ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి ముందు జ్ఞాపకశక్తిని కోల్పేయే తేలిక పాటి లక్షణాలను చూపిస్తుంది. ఆ తర్వాత కొద్ది కొద్దిగా దీని ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మొదటగానే ఈ లక్షణాలను పసిగట్టి.. చికిత్స తీసుకోవాలి. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. కొన్ని చిట్కాల ద్వారా కూడా ఈ వ్యాధిని మనం అదుపు చేయవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి:

ఇవి కూడా చదవండి

హై బ్లడ్ ప్లెజర్ తో బాధపడే వ్యక్తులు ఎక్కువగా అల్జీమర్స్ వ్యాధి బారిన పడుతున్నట్టు పలు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి రక్త పోటు ఉన్న వ్యక్తులు వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. రక్త పోటును కంట్రోల్ లో ఉంచేందుకు జాగ్రత్తలు, చికిత్స తీసుకుంటూ ఉండాలి.

బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయాలి:

రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి. బ్లడ్ లో చక్కెర నియంత్రణ లేని వారిలో కూడా ఈ అల్జీమర్స్ కనిపిస్తుంది. కాబట్టి షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే ఆహారాన్ని, వ్యాయామాలు చేయాలి.

స్మోకింగ్ మానేయాలి:

కొంత మందికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది. స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల కూడా అల్జీమర్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉందట. అంతేకాకుండా ధూమ పానం చేయడం వల్ల రక్త పోటును, క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు ఉన్నా ఉన్నాయి. స్మోకింగ్ చేయడం వల్ల ప్రపంచంలో దాదాపు 14 శాతం మంది అల్జీ మర్స్ బారిన పడుతున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

బరువు నియంత్రణ:

బరువు ఉన్న వ్యక్తులు కూడా అల్జీమర్స్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మితంగా ఆహారం తింటూ, వ్యాయామాలు చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవాలి.

యాక్టీవ్ గా ఉండాలి:

వీలైనంత వరకూ యాక్టీవ్ గా ఉండేలా చూసుకోండి. మీ రోజు ఉత్సాహంగా స్టార్ట్ చేయండి. అలాగే ఉత్సాహంగా ఉండే వారితో మాట్లాడేందుకు ట్రై చేయండి. నిరాశ, ఒత్తిడి వంటి వాటిని దరి చేరనివ్వకుండా చూసుకోవాలి.

అవసరమైనంత నిద్ర:

నిద్ర చాలా ముఖ్యం. మీ పనులు అనంతరం హ్యాపీగా నిద్ర పోయేలా చూసుకోండి. ముఖ్యంగా 7 నుంచి 8 గంటల నిద్ర మనిషికి చాలా అవసరం. అయితే పలు కారణాల వల్ల చాలా మంది తక్కువ సమయమే నిద్ర పోతున్నారు. ఇది కూడా అల్జీ మర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందట.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.