Thyroid in Men: పురుషుల్లోనూ థైరాయిడ్ సమస్య.. ఈ లక్షణాలు కన్పిస్తే అలసత్వం వద్దు!
థైరాయిడ్ సమస్య సాధారణంగా మహిళల్లో కనిపిస్తుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి. వెంటనే చికిత్స తీసుకోకుండా తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అయితే ఇది పురుషుల్లోనూ సంభవిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. ఇందుకు కారణం థైరాయిడ్ లక్షణాలు పురుషుల్లో చాలా స్పల్పంగా కనిపించడమే..
![Thyroid in Men: పురుషుల్లోనూ థైరాయిడ్ సమస్య.. ఈ లక్షణాలు కన్పిస్తే అలసత్వం వద్దు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/thyroid-in-men.jpg?w=1280)
థైరాయిడ్ సమస్యలు స్త్రీలలో సర్వసాధారణమని మీరు చాలా సార్లు వినే ఉంటారు. కానీ ఈ సమస్య పురుషులను కూడా ప్రభావితం చేస్తుందంటే మీరు నమ్ముతారా? అవును, ఈ రకమైన సమస్య మహిళల్లోనే కాదు పురుషుల్లో కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పురుషులలో ఈ సమస్యను విస్మరించడం వంధ్యత్వానికి దారి తీస్తుందట. కాబట్టి దాని గురించి సరిగ్గా తెలుసుకోవడం, దాని లక్షణాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కాబట్టి పురుషులలో థైరాయిడ్ ఎప్పుడు కనిపిస్తుంది? దాన్ని నివారించడం ఎలా? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి వల్ల వస్తుంది. ఇది శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసే పరిస్థితి. దీనిని “హైపర్ థైరాయిడ్” అని కూడా అంటారు. దీని లక్షణాలు సూక్ష్మంగా ఉంటాయి. ప్రత్యేకంగా కనిపించవు. కొన్ని లక్షణాలు పురుషులు, స్త్రీలలో సాధారణంగా కనిపిస్తాయి. కొన్ని లక్షణాలు పురుషులలో మాత్రమే కనిపిస్తాయి. సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది గుండె, కండరాలు, స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది.
పురుషులలో థైరాయిడ్ లక్షణాలను ఎలా గుర్తించవచ్చు?
సాధారణంగా ఈ ఆరోగ్య సమస్య ఉన్న వారిలో ఆందోళన, చిరాకు, బరువు తగ్గడం, కండరాల బలహీనత, కంటి చికాకు, మతిమరుపు వంటి లక్షణాలు ఉంటాయి. కొన్నిసార్లు ముఖం, శరీర భాగాలు ఉబ్బుతాయి. చెమట తగ్గడం, చర్మం పొడిబారడం, వెంట్రుకలు రాలిపోవడం, గొంతు వాచడం, స్వరంలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపర్ థైరాయిడిజం ఉన్న పురుషుల్లో బరువు పెరగడం, అధిక రక్తపోటు, బీపీలో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తాయి. అరచేతులలో జలదరింపు, తిమ్మిరి, గుండె వేగం తగ్గడం, పాదాలలో వాపు, నడుస్తున్నప్పుడు కాళ్ళలో సమన్వయం లేకపోవడం వంటివి ఇతర లక్షణాలు. కొన్నిసార్లు వెన్నెముక, తుంటిలో బలహీనత ఏర్పడుతుంది. దీంతో వారు చాలా అసౌకర్యానికి గురవుతుంటారు. అకస్మాత్తుగా అధిక జుట్టు రాలిపోయినా జాగ్రత్తగా ఉండాలి. హైపర్ థైరాయిడిజం కారణంగా, కండరాలు నిస్తేజంగా మారుతాయి. ఈ సమస్య సాధారణంగా పురుషులు, స్త్రీలలో ఒకే విధమైన లక్షణాలతో ఉన్నప్పటికీ, పురుషులను మాత్రమే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
పురుషులలో హైపర్ థైరాయిడిజానికి కారణమేమిటి?
సాధారణంగా గ్రేవ్స్ వ్యాధి అని పిలవబడే పరిస్థితి పురుషులలో ఈ సమస్యకు కారణమని చెప్పబడింది. గ్రేవ్స్ వ్యాధి ఆరోగ్యకరమైన థైరాయిడ్ గ్రంధిపై పొరపాటున దాడి చేయడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి పురుషులు దుష్ప్రభావాలను కలిగించే మందులను ఎక్కువగా తీసుకోకుండా ఉండటం చాలా మంచిది.
ఎలా నిరోధించాలి?
ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎందుకంటే వ్యాయామం శరీరానికి చాలా మంచిది. అంతే కాకుండా, ఈ సమస్యను అదుపులో ఉంచుకోవడానికి లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక్కసారైనా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.