AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney disease: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధికి సంకేతం కావొచ్చు.. ఆలస్యంగా గుర్తిస్తే..

పాలీసిస్టిక్ వ్యాధి కారణంగా మూత్రపిండంలో తిత్తులు ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇందులో ద్రవం కూడా ఉంటుంది. కొన్నిసార్లు పొక్కులు కూడా రావచ్చు. ఈ వ్యాధిలో మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.

Kidney disease: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధికి సంకేతం కావొచ్చు.. ఆలస్యంగా గుర్తిస్తే..
Kidney Disease
Venkata Chari
|

Updated on: Sep 29, 2022 | 7:05 AM

Share

మన శరీరంలో కిడ్నీ చాలా ముఖ్యమైన అవయవం. మూత్రం రూపంలో శరీరంలో ఉండే చెడు పదార్థాలు, రసాయనాలను తొలగించడం దీని ముఖ్యమైన పని. కానీ, మూత్రపిండంలో ఏదైనా తేడాగా కనిపిస్తే.. వ్యాధుల బారిన పడేందుకు సంకేతాలుగా గుర్తించాలి. మూత్రపిండాల్లో చిన్న తిత్తులు ఏర్పడటం ప్రారంభిస్తాయి. దీన్నే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే, పరిస్థితి తీవ్రంగా మారడం ప్రారంభమవుతుంది. అయితే ఈ సమస్యను సకాలంలో గుర్తించడం వల్లనే నియంత్రించే అవకాశం ఉంది.

గత కొన్నేళ్లుగా పాలీసిస్టిక్ కిడ్నీ వ్యాధి కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇది ఏ వయసులోనైనా జరగవచ్చు. ఈ వ్యాధిలో మూత్రపిండంలో తిత్తులు ఏర్పడటం ప్రారంభిస్తాయి. దీనిలో ద్రవం కూడా నిండి ఉంటుంది. కొన్నిసార్లు పొక్కులు కూడా రావచ్చు. ఇలా జరిగితే కిడ్నీ పని చేసే సామర్థ్యం దెబ్బతింటుంది. ఈ వ్యాధిని సకాలంలో నియంత్రించకపోతే కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తుందని న్యూరాలజిస్ట్ డాక్టర్ హిమాన్షు శర్మ తెలిపారు. ఈ పరిస్థితిలో డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడికి కూడా అవకాశం ఏర్పడుతుంది.

ఈ వ్యాధి రావడానికి నిర్దిష్ట కారణాలేమీ లేవని డాక్టర్ తెలిపారు. ఇది జన్యుపరమైన వ్యాధి, ఇది ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుందని తెలిపారు. PKD సోకిన వ్యక్తులు కూడా కాలేయం, ప్యాంక్రియాస్‌తో సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. రక్తపోటు ఉన్నవారికి పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

లక్షణాలు ఆలస్యంగా బయటపడతాయి..

ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆలస్యంగా గుర్తిస్తుంటారు. 40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో సమస్యలు పెరుగుతాయి. ఆ సమయంలో పీకేడీ లక్షణాలు కనిపిస్తాయి.

లక్షణాలు ఇవే..

పొత్తికడుపు పెరగడం

మూత్రంలో రక్తం

నిరంతర వెన్నునొప్పి

తరచుగా మూత్ర విసర్జన

ఇలాంటి వారు ప్రమాదంలో పడ్డట్లే..

ఒక వ్యక్తి కుటుంబంలో PKDతో బాధపడుతున్నట్లయితే, ఈ వ్యాధి ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, కిడ్నీలో తిత్తులు ఏర్పడటంలో ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. సకాలంలో చికిత్స చేస్తే, ఈ వ్యాధిని సులభంగా నియంత్రించవచ్చు. సరైన సమయంలో చికిత్స పొందడం ద్వారా తిత్తుల సమస్య నయమవుతుంది. కానీ, రోగి దాని గురించి అజాగ్రత్తగా ఉంటే, రాబోయే కొన్నేళ్లలో కిడ్నీ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..