Telugu News » Photo gallery » Cricket photos » Adil Rashid to Yuzvendra Chahal like 5 Spinner Can Game Changers In T20 World Cup 2022 Tournament telugu cricket news
T20 World Cup 2022: ఖాన్ నుంచి చాహల్ వరకు.. టీ20 ప్రపంచ కప్‌లో గేమ్ ఛేంజర్‌లుగా మారనున్న ఐదుగురు స్పిన్నర్లు వీరే..
Venkata Chari |
Updated on: Sep 27, 2022 | 8:56 AM
ఆస్ట్రేలియా పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలమైనవిగా పరిగణిస్తుంటారు. కానీ, ప్రతి జట్టులో కూడా నాణ్యమైన స్పిన్నర్లు ఉంటారు. ఇలాంటి పరిస్థితులను ఎలా ఉపయోగించుకోవాలో స్పిన్నర్లకు బాగా తెలుసు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ టీ20లో ప్రాణాంతకంగా మారగల స్పిన్నర్లు ఎవరో చూద్దాం..
Sep 27, 2022 | 8:56 AM
T20 World Cup 2022 Spinners
1 / 6
ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్): పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆదిల్ రషీద్ లేకుండా ఇంగ్లీష్ జట్టు అసంపూర్ణంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పొట్టి ఫార్మాట్‌లో రషీద్ మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంగ్లండ్ తరపున 34 ఏళ్ల పాకిస్థానీ సంతతికి చెందిన స్పిన్నర్ 76 మ్యాచ్‌లలో 7.35 ఎకానమీతో 83 వికెట్లు పడగొట్టాడు.
2 / 6
ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా): గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా వైట్‌బాల్ క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న జంపా.. బ్యాట్స్‌మెన్‌లను బోల్తా కొట్టించడంలో నేర్పరి. జంపా వేగం, వైవిధ్యాలతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాడు. 2021లో ఆస్ట్రేలియా మొదటి T20 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన జంపా, 5.81 ఎకానమీతో 7 మ్యాచ్‌లలో 13 వికెట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.
3 / 6
మహ్మద్ నవాజ్ (పాకిస్థాన్): పొట్టి ఫార్మాట్‌లో నవాజ్ తన జట్టు తరపున నిలకడగా రాణిస్తున్నాడు. 28 ఏళ్ల స్పిన్నర్ పెద్ద వేదికలపై బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతుంటాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ పాకిస్థాన్ తరపున 36 టీ20ల్లో 33 వికెట్లు పడగొట్టాడు. 6.95 ఎకానమీతో బౌలింగ్ చేసిన ఈ స్పిన్ మాస్టర్.. ఆసియాకప్‌లోనూ బ్యాట్‌తో సత్తా చాటాడు.
4 / 6
రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్): ప్రస్తుతానికి రషీద్ ఖాన్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్. ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఎలాంటి పిచ్‌లోనైనా ఆటను మలుపు తిప్పగల శక్తి కలిగి ఉన్నాడు. 23 ఏళ్ల అతను 71 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 6.25 ఎకానమీతో 118 వికెట్లు పడగొట్టాడు. బంతిని గొప్పగా తిప్పకుండానే వికెట్-టు-వికెట్ డెలివరీలతో బ్యాట్స్‌మెన్స్‌ను ఇబ్బందులు పెడుతుంటాడు.
5 / 6
యుజ్వేంద్ర చాహల్ (భారతదేశం): టీమిండియా అటాకింగ్ స్పిన్నర్ చాహల్ లైన్-లెంగ్త్ ఖచ్చితంగా ఉంటుంది. తన వైవిధ్యాలతో బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేసిన చాహల్, తెలివిగల లెగ్ స్పిన్నర్‌గా పేరుగాంచాడు. 32 ఏళ్ల ఈ ఆటగాడిని టీమ్ ఇండియా మిడిల్ ఓవర్లలో ఉపయోగించుకుంటుంది. అతనిలాంటి సాహసోపేతమైన, ధైర్యమైన బౌలర్‌కు ఆస్ట్రేలియాలోని పెద్ద మైదానాలు సరైనవిగా మారుతుంటాయి. రాబోయే T20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సేనకు అతని ఫామ్ కీలకం.