- Telugu News Photo Gallery Cricket photos Ind vs sa mister 360 degree player surya kumar yadav just 7 runs away from shikhar dhawan t20i record
IND vs SA: దక్షిణాఫ్రికాపై సరికొత్త రికార్డ్ సృష్టించనున్న మిస్టర్ 360 ప్లేయర్.. లిస్టులో ఎవరున్నారంటే?
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లో చేయబోయే పరుగులు ఎంతో కీలకంగా మారనున్నాయి.
Updated on: Sep 27, 2022 | 11:28 AM

ప్రస్తుతం భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాపై విజయం సిరీస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. అయితే, సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లో చేయబోయే పరుగులు ఎంతో కీలకంగా మారనున్నాయి.

ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ దక్షిణాఫ్రికాకు కూడా ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది. విశేషమేమిటంటే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ చేయబోయే 7వ పరుగు చాలా విలువైనదిగా రుజువు కానున్నది.

అదేంటి, ఈ 7వ పరుగుకు అంత ప్రత్యేకత ఏముందని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం.. ఈ 7వ పరుగు భారీ రికార్డుకు సంబంధించినది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సూర్యకుమార్ యాదవ్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక T20I పరుగులు చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు. ప్రస్తుతం అతని పేరు మీద 682 పరుగులు ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికాపై 7వ పరుగు చేస్తే శిఖర్ ధావన్ పేరిట ఉన్న భారత రికార్డును సమం చేస్తాడు. ఇక 8వ పరుగు కూడా సాధిస్తే ధావన్‌ను ఈ లిస్టునుంచి తప్పిస్తాడు.

శిఖర్ ధావన్ 2018లో 689 టీ20 పరుగులు చేశాడు. అయితే ధావన్ చేసిన ఈ రికార్డును సూర్య నాశనం చేసే అవకాశం ఉంది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక T20 ఇంటర్నేషనల్ పరుగులు చేసిన పరంగా, విరాట్ కోహ్లీ 641 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. అతను 2016 సంవత్సరంలో ఈ పరుగులు చేశాడు.





























