Watch Video: బంతి తగిలి మైదానంలోనే కుప్పకూలిన పావురం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

క్రికెట్ మైదానంలో తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా ఇంగ్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డర్ విసిరిన బంతి ఎగిరే పావురాన్ని తాకడంతో, ఓ విషాదం చోటుచేసుకుంది.

Watch Video: బంతి తగిలి మైదానంలోనే కుప్పకూలిన పావురం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Cricket Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Sep 27, 2022 | 1:58 PM

క్రికెట్ మైదానంలో సిక్సర్లు, ఫోర్ల మోత మోగుతుందని తెలిసిందే. బ్యాటర్లు, బౌలర్లకు మధ్య జరిగి పోరులో ఎవరో ఒకరు బలికావాల్సిందే. బౌలర్లు కూడా అద్భుతమైన బంతులు విసురుతూ బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చిన సందర్భాలు ఎన్నో చూశాం. ఓవరాల్‌గా క్రికెట్ మ్యాచ్‌లో మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. కానీ, కొన్నిసార్లు ఈ గేమ్‌లో కొన్ని సంఘటనలు బాధను కూడా కలిగిస్తాయి. ఎందుకంటే మ్యాచ్ సమయంలో గాయాలు, మరణాలు కూడా సంభవించిన సంఘటనలు చూశాం. తాజాగా ఇలాంటి ఓ విశాద సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఓ ఆటగాడు బాల్ విసరడంతో పావురం చనిపోయింది. దీంతో అంతా విచారం వ్యక్తం చేశారు.

లాంక్షైర్, యార్క్‌షైర్ మధ్య జరిగింది. లంకాషైర్ బ్యాటింగ్ సమయంలో, 11వ ఓవర్లో, లంకాషైర్ బ్యాట్స్‌మెన్ అష్వెల్ ప్రిన్స్ మిడ్ వికెట్ వైపు షాట్ ఆడాడు. అతను రెండు పరుగులు చేశాడు. ఈ సమయంలో, బంతిని పట్టుకున్న ఫీల్డర్ జాక్ రుడాల్ఫ్ బలంగా వికెట్ల వద్దుకు విసిరాడు. ఈ సమయంలో గాలిలో ఎగురుతున్న పావురానికి బంతి తాకింది. బంతి తగిలిన వెంటనే పావురం నేలపై పడి చనిపోయింది.

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికా ఆటగాడి త్రో కారణంగా..

జాక్ రుడాల్ఫ్ ఉద్దేశపూర్వకంగా పావురాన్ని కొట్టలేదు. వాస్తవానికి అతను సాధారణ త్రో విసిరాడు. కానీ, దురదృష్టవశాత్తు బంతి ఎగిరే పావురాన్ని తాకింది. ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే మైదానంలో కూర్చున్న వేలాది మంది అభిమానులు కేకలు వేశారు. మొదట్లో చాలా మందికి ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ, రీప్లే చూపించినప్పుడు, రుడాల్ఫ్ విసిరివేయడం వల్ల పావురం చనిపోయిందని అందరికీ తెలిసింది.

జాక్ రుడాల్ఫ్ నవ్వుతున్నాడు..

ఆశ్చర్యకరంగా, ఈ సంఘటన తర్వాత జాక్ రుడాల్ఫ్ నవ్వుతూ కనిపించాడు. పావురం చచ్చిపోయింది. కానీ, రుడాల్ఫ్ నవ్వుతున్నాడు. ఈ త్రో తర్వాత అంపైర్ బంతిని డెడ్‌గా ప్రకటించాడు. ఈ బంతి మళ్లీ బౌల్డ్ చేశారు. లంకాషైర్ సాధించిన రెండు పరుగులు కూడా వెనక్కి తీసుకున్నారు.

జాక్ రుడాల్ఫ్ ఎవరు?

జాక్ రుడాల్ఫ్ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 6 సెంచరీల బలంతో దక్షిణాఫ్రికా తరపున 48 టెస్టు మ్యాచ్‌ల్లో 2622 పరుగులు చేశాడు. వన్డేల్లో 39 ఇన్నింగ్స్‌ల్లో 1174 పరుగులు చేశాడు. రుడాల్ఫ్ బ్యాట్ 7 వన్డే హాఫ్ సెంచరీలు చేసింది. అతని ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో, రుడాల్ఫ్ 51 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో అతని పేరుతో 18 సెంచరీలు ఉన్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..