Multibagger Stock: రూ. లక్ష పెట్టుడిని.. రూ. 20 లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ఏడాదిలోనే బంఫర్ రిటర్స్..

గత ఒక సంవత్సరంలో ఈ స్టాక్ దాని పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించింది. ఈ సమయంలో ఈ షేర్ రూ.67 నుంచి రూ.1,390కి పెరిగింది.

Multibagger Stock: రూ. లక్ష పెట్టుడిని.. రూ. 20 లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ఏడాదిలోనే బంఫర్ రిటర్స్..
Multibagger Stocks
Follow us

|

Updated on: Sep 27, 2022 | 11:30 AM

Multibagger Stock: తక్కువ వ్యవధిలో తమ పెట్టుబడిదారులకు అధిక లాభాలు అందించే మల్టీబ్యాగర్ స్టాక్స్ చాలానే ఉన్నాయి. అయితే, వీటిని ఎంచుకోవడంలోనే పెట్టుబడిదారులు ఇబ్బందులు పడుతుంటారు. మల్టీబ్యాగర్ స్టాక్స్ అందించే అధిక లాభాల కోసం చాలాకాలం వేచిఉండాల్సిన అవసరం కూడా ఉంది. అయితే, ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. చాలా ఆశగా సెర్చ్ చేస్తుంటారు. అందుకే, ఈ రోజు అలాంటి ఓస్టాక్‌తో మీముందుకు వచ్చాం. జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కూడా అధిక లాభాలు అందించిన స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది. తాజాగా కంపెనీ షేర్లు రూ.1,390.65 వద్ద ముగిశాయి. అంతకుముందు శుక్రవారం ఈ షేరు రూ.1,426.45 వద్ద ముగిసింది. గత ఒక సంవత్సరంలో, ఈ స్టాక్ దాని పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించింది. ఈ సమయంలో ఈ షేర్ రూ.67 నుంచి రూ.1,390కి పెరిగింది.

Gensol Engineering Ltd షేర్ ధర..

గత మూడేళ్లలో అంటే 18 అక్టోబర్, 2019 నాటికి స్టాక్ ధర ₹63.41గా నిలిచింది. ప్రస్తుతం జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ స్టాక్ రూ.1,390.65కి పెరిగింది. ఈ కాలంలో ఇది 2,093.11% మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. అంటే మూడేళ్ల క్రితం ఈ స్టాక్‌లో ₹ 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, మీకు ₹ 21.93 లక్షల రాబడి వచ్చేది. అదే సమయంలో ఈ షేర్ ఒక సంవత్సరంలో రూ. 67 నుంచి ₹ 1,390కి పెరిగింది. ఈ కాలంలో స్టాక్ 1,948.69% రాబడిని ఇచ్చింది. ఒక ఇన్వెస్టర్ ఏడాది క్రితం ఈ స్టాక్‌లో రూ.లక్ష పెట్టుబడి పెడితే, ఇప్పుడు ఈ మొత్తం రూ.20 లక్షలకు పెరిగింది.

ఇవి కూడా చదవండి

కంపెనీ గురించి..

జెన్సోల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ అనేది వాణిజ్య సేవల పరిశ్రమలో క్రియాశీలంగా ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ. కంపెనీ దేశీయంగా, అంతర్జాతీయంగా సౌర ప్రాజెక్టులకు సేవలను అందిస్తుంది. అహ్మదాబాద్, ముంబైలలో కార్యాలయాలతో, సంస్థ 18 రాష్ట్రాల్లో బ్రాంచ్‌లను కలిగి ఉంది. ఇది కెన్యా, చాడ్, గాబన్, ఈజిప్ట్, సియెర్రా లియోన్, యెమెన్, ఒమన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలో కూడా ప్రస్తుత ప్రాజెక్ట్‌లను కలిగి ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..