Clean Stomach Naturally: పొట్టని నేచురల్ గా క్లీన్ చేసే చిట్కాలు ఇవే.. అస్సలు మిస్ చేయకండి..!
ఉదయం మొదలు.. రాత్రి పడుకునేంత వరకూ పొట్టలో ఏదో ఒకటి వేస్తూనే ఉంటాం. ఏం తింటామో.. ఎంత తింటామో కూడా తెలీదు. నచ్చితే మరీ ఎక్కువగా తినేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది రోడ్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ వీటితో వచ్చే సమస్యల గురించి ఆలోచించారు. సాధారణంగా శరీరాన్ని స్నానం చేసి శుభ్రం చేసుకుంటాం. కానీ మన అంతర్గత అవయవాలు క్లీన్ గా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. మనం తిన్నవి తిన్నట్టు..

ఉదయం మొదలు.. రాత్రి పడుకునేంత వరకూ పొట్టలో ఏదో ఒకటి వేస్తూనే ఉంటాం. ఏం తింటామో.. ఎంత తింటామో కూడా తెలీదు. నచ్చితే మరీ ఎక్కువగా తినేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది రోడ్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ వీటితో వచ్చే సమస్యల గురించి ఆలోచించారు. సాధారణంగా శరీరాన్ని స్నానం చేసి శుభ్రం చేసుకుంటాం. కానీ మన అంతర్గత అవయవాలు క్లీన్ గా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. మనం తిన్నవి తిన్నట్టు మల విసర్జన అవ్వాలన్నా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే.. ముందు పొట్ట శుభ్రంగా ఉండాలి. పొట్టను క్లీన్ చేయడం అంటే మామూలు విషయం కాదు.. ఒక నెల రోజులు కేటాయించాలి. మనం తీసుకునే ఆహారం కూడా అందుకు తగినట్లుగానే ఉండాలని గుర్తించు కోండి. మరి పొట్టను ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హెర్బల్ టీలు:
సాధారణం కాఫీ, టీలుకు బదులు పొట్ట క్లీన్ గా ఉండాలంటే హెర్బల్ టీలు తాగాలి. వీటలో యాంటీ మైక్రోబియల్ ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి పేగుల్లో చెడు బ్యాక్టీరియాను తగ్గించి.. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. అంతే కాకుండా పేగుల కదలికలు కూడా సజావుగా జరిగేలా చేస్తుంది.
ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్ లు:
ఉదయం పరగడపున పండ్లు కానీ, పండ్ల రసాలు కానీ తాగితే.. చాలా మంచిది. ఈ విషయం మనకి కూడా తెలుసు. కానీ అందుకు సమయం ఉండదు. కానీ పొట్ట ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే.. చక్కగా శుభ్రం కావాలి.
తేనె, నిమ్మరసం:
ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మ రసం కలుపుకుని తాగితే.. నేచురల్ గా పొట్ట క్లీన్ గా ఉండటమే కాకుండా.. వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. అదే విధంగా చర్మం కూడా కాంతి వంతంగా తయారవుతుంది.
పీచు పదార్థాలు:
పొట్ట శుభ్రంగా ఉండాలంటే పీచు పదార్థాలు చాలా ముఖ్యం. ఇవి మనం తీసుకునే ఆహారంలో ఉంటేనే.. జీర్ణ వ్యవస్థ చక్కగా నడుస్తుంది. ఫ్రెష్ కూరగాయలు, క్యారెట్లు, కిడ్నీ బీన్స్, శనగలు, ఓట్స్, ఇలా ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకుంటే చాలా బెటర్. అదే విధంగా నీటిని కూడా ఎక్కువగా తీసుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








