Jaggery Milk Benefits: పాలలో చక్కెరకు బదులు ఇది కలుపుకోండి.. మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పాలు క్రమంతప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు. క్యాల్షియం మొదలు పాలలో ఉండే ఎన్నో పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి..

Jaggery Milk Benefits: పాలలో చక్కెరకు బదులు ఇది కలుపుకోండి.. మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
Jaggery Milk Health Benefits
Follow us

|

Updated on: Dec 04, 2022 | 11:39 AM

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పాలను క్రమంతప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు. క్యాల్షియం మొదలు పాలలో ఉండే ఎన్నో పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సహజంగా మనమంతా పాలలో చక్కెర కలుపుకొని తాగుతుంటాం. అయితే చక్కెర మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తుందనే విషయం తెలిసిందే. అయితే చక్కెరకు బదులుగా బెల్లంను కూడా కలుపుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బెల్లం పాలు కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఇంతకీ బెల్లం కలిపిన పాలతో కలిగే ప్రయోజనాలపై ఓ లుక్కేయండి..

* మనలో చాలా మందికి కొంచెం పని చేసినా వెంటనే అలసి పోతుంటారు. పాలలో బెల్లం కలుపుకొని తాగడం వల్ల అలసట, బలహీనత వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. ఇందులో ఉండే క్యాల్షియం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో అలసట దూరమై యాక్టివ్‌గా ఉంటారు.

* జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారు కూడా బెల్లం కలిపిన పాలు తాగాలి. ఇది జీర్ణక్రియ మెరుగవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవక్రియ మెరుపడి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అజీర్తితో పాటు, గుండెల్లో మంట, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.

ఇవి కూడా చదవండి

* సాధారణంగానే చలికాలంలో రోగనిరోధక శక్తి బాగా తగ్గుతుంది. ఇలాంటి సమయంలో బెల్లం, పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మిశ్రంలో ఉండే విటమిన్ ఎ, డి, జింక్, ఐరన్, సెలీనియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పని చేస్తాయి.

* ఇక రాత్రిపూట నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి కూడా బెల్లం, పాలు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. రాత్రి పూట పడుకునే ముందు ఒక గ్లాసు బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల మంచి నిద్ర సొంతమవుతుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..