Zombie-Virus: మంచుమాటున జాంబి వైరస్.. కరోనా మించిన ప్రమాదమంటున్న శాస్త్రవేత్తలు..
కరోనా మహమ్మారి బారినుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే రకరకాల కొత్త వైరస్‌లు మానవాళికి సవాలు విసురుతున్నాయి. తాజాగా 48,500 ఏళ్లనాటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు.
రష్యాలోని సైబీరియా ప్రాంతం సంవత్సరంలో అత్యధిక భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడి మంచు పొరల కింద సేకరించిన నమూనాలను యూరప్ పరిశోధకులు పరీక్షించారు. వాటిలో 13 రకాల హానికరమైన సూక్ష్మజీవ జాతులను గుర్తించి, వాటిని వర్గీకరించారు. వీటిని పరిశోధకులు జాంబీ వైరస్ లు గా భావిస్తున్నారు. వేల సంవత్సరాలుగా అవి నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ, వ్యాధి కారక శక్తిని మాత్రం కోల్పోలేదని తెలుసుకున్నారు. రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల శాస్త్రవేత్తలు సంయుక్త పరిశోధనలో ఈ వైరస్‌ను గుర్తించారు. అత్యంత ఘనీభవించిన ఈ మంచు కరిగిపోతే బయటి వాతావరణంలోకి విడుదలయ్యే ఈ రాకాసి వైరస్ లు జంతువులకు, మానవాళికి పెను సమస్యగా పరిణమిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి బాహ్య వాతావరణంలోకి ప్రవేశించాక ఎంతకాలం వ్యాధికారకంగా ఉంటాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో… ఈ వైరస్ లకు, మానవాళికి మధ్య వాహకాలు ఏమిటో అంచనా వేయడం ఇప్పటికీ అసాధ్యంగానే ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఇవి కలిగించే ముప్పును అంచనా వేయలేమని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

