Slow Aging: 35, 40 ఏళ్లలోనూ 20లా కనిపించాలా? అయితే డైటీషియన్స్ చెబుతున్న సూత్రాలివే!
కొంతమంది తక్కువ వయస్సు ఉన్నా.. ఎక్కువ వయస్సున్న వారిగా కనిపిస్తారు.. మరికొందరు ఎక్కువ వయస్సున్నా చాలా తక్కువ వయస్సున్న వారిలా కనిపిస్తారు. అలాంటి వారిని..
కొంతమంది తక్కువ వయస్సు ఉన్నా.. ఎక్కువ వయస్సున్న వారిగా కనిపిస్తారు.. మరికొందరు ఎక్కువ వయస్సున్నా చాలా తక్కువ వయస్సున్న వారిలా కనిపిస్తారు. అలాంటి వారిని చూస్తున్నప్పుడు అబ్బా.. వీళ్లు ఎలా మెయింటేన్ చేస్తారురా బాబు! అని అనిపించక మానదు. అది ఆడవారైనా, మగవారైనా! అయితే పెరుగుతున్న వయస్సును ఎవరూ ఆపలేరు. చర్మం ముడతలు పడటం, కీళ్ల నొప్పులు, వంటివి వేధిస్తూనే ఉంటాయి. కానీ వయస్సు పెరుగుతున్న ఛాయను బయటకు కనిపించకుండా చేయవచ్చని డైటీషియన్స్ చెబుతున్నారు. కొన్ని ప్రత్యేకమైన సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా ఇది సాధ్యమని వివరిస్తున్నారు. ఇవి ఆరోగ్యదాయకమని విశ్లేషిస్తున్నారు. అవేంటో చూద్దాం..
కొల్లాజెన్..
చాలా ఏళ్ల నుంచి కొల్లాజెన్ అనేది ఒక ఉపయుక్తమైన సప్లిమెంట్ గా ఉంది. ఇది పౌడర్, లిక్విడ్ రూపాల్లో లభ్యమవుతుంది. దీనిలో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు ఉంటాయి. అలాగే ఎముకలు, చర్మం, తల, గోళ్లు వంటివి ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది. దీని తీసుకోవడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఉదయం సమయంలో తీసుకునే కాఫీ, టీ, లేదా నీటిలో కలుపుకొని తీసుకోవచ్చు.
విటమిన్ సీ..
ఇది శరీరానికి చాలా అవసరం. అలాగే ఇది శరీరంలోనే కొల్లాజెన్ తయారవడానికి ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారిపోకుండా కాంతివంతంగా ఉంచుతుంది. అలాగే విటమిన్ సీలో అధిక సంఖ్యలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
రెస్వెరాట్రాల్..
ఇది శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు అందిస్తుంది. గుండె, నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
ఓమెగా 3..
ఓమెగాలోని కొవ్వులు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకే దీనిని దశాబ్దాలుగా అందరూ విరివిగా వినియోగిస్తున్నారు. దీనిలో ఓమెగా 3 ఎస్, ఓమెగా 6 ఎస్ వంటి చాలా రకాల ఉన్నప్పటికీ వాటన్నింటిలో ఓమెగా 3 మాత్రమే అధికమైన న్యూట్రియంట్స్ కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి గాక బీ12, గ్రీన్ టీ ఎక్స్ ట్రాక్ట్, లయన్స్ మేన్ వంటివి కూడా శరీరంలో వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేయడంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి