Basic First Aid Skill: ఎమర్జన్సీ ప్రాణాలను నిలబెట్టే టిప్స్.. సీపీఆర్ సహా ఈ 5 టెక్నిక్స్ తెలుసుకోండి..

ఇటీవల హైదరాబాద్ లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గుండెపోటుతో విలవిలలాడుతున్న యువకుడికి ఫుట్ పాత్ మీదనే సీపీఆర్ నిర్వహించి అతడి ప్రాణాలను కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Basic First Aid Skill: ఎమర్జన్సీ ప్రాణాలను నిలబెట్టే టిప్స్.. సీపీఆర్ సహా ఈ 5 టెక్నిక్స్ తెలుసుకోండి..
CPR
Follow us
Madhavi

| Edited By: Anil kumar poka

Updated on: Feb 27, 2023 | 6:36 PM

ఇటీవల హైదరాబాద్ లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గుండెపోటుతో విలవిలలాడుతున్న యువకుడికి ఫుట్ పాత్ మీదనే సీపీఆర్ నిర్వహించి అతడి ప్రాణాలను కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాదు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి ప్రతీ ఒక్కరూ సలాం కొట్టారు. ఆ సమయానికి సీపీఆర్ నిర్వహించడం వల్ల ఓ నిండు ప్రాణం కాపాడినట్లు అయ్యింది. అయితే ఫస్ట్ ఎయిడ్ లో భాగంగా సీపీఆర్ అనేది అత్యంత అవసరమైనది. దీన్ని ప్రత్యేకంగా నేర్చుకోవడం ద్వారా మీరు నిండు ప్రాణాలను కాపాడవచ్చు.

గాయపడిన వ్యక్తికి అందించబడే తక్షణ చికిత్సను ప్రథమ చికిత్స అంటారు. ఒక ప్రాణాన్ని సజీవంగా ఉంచడంతో పాటు, పరిస్థితి మరింత దిగజారకుండా ఆపడం. కోసం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఆరు ప్రాథమిక ప్రథమ చికిత్సలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఆరు ప్రాథమిక ప్రథమ చికిత్స నైపుణ్యాలు:

CPR:

ఇవి కూడా చదవండి

కార్డియోపల్మోనరీ విభాగంలో నేర్చుకోవలసిన అత్యంత ముఖ్యమైన ప్రథమ చికిత్స సీపీఆర్. ఇది శ్వాస తీసుకోలేక అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి వారి ప్రాణాలను కాపాడేందుకు కృత్రిమ వెంటిలేషన్‌ను అందించవచ్చు. ఇది ఊపిరితిత్తులు, మెదడుకు ఆక్సిజన్‌ను అందించడంలో సహాయపడుతుంది. కార్డియాక్ అరెస్ట్ సమయంలో ప్రాణాలను నిలిపే అవకాశాలను పెంచుతుంది.

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏం చేయాలి:

మెదడుకు రక్త ప్రసరణ లేకపోవడం షాక్ లేదా స్ట్రోక్ సంభవించవచ్చు. అప్పుడు బాధితుడి పాదాలను పైకి లేపి ఉంచాలి. ఆసమయంలో వారికి ఎలాంటి ద్రవపదార్థాలు ఇవ్వకూడదు. ఒక వేళ బాధితుడు ప్యాంటు బెల్ట్‌ పెట్టుకుంటే దాన్ని తొలగించండి. బట్టలు కూడా కాస్త వదులుగా ఉంచేలా జాగ్రత్త తీసుకోండి. రోగి శ్వాస తీసుకోలేకపోతే, మీరు CPRని నిర్వహించాల్సి ఉంటుంది.

యాక్సిడెంట్ లో తీవ్రమైన రక్తస్రావం:

చాలా మంది వ్యక్తులు ప్రమాదాలకు గురవుతారు. ఫలితంగా తీవ్రమైన రక్తస్రావం తలెత్తవచ్చు. అటువంటి క్లిష్ట సమయాల్లో, వణికిపోకుండా, ప్రాణాలను కాపాడటం కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. గాయంపై స్టెరైల్ బ్యాండేజ్‌చుట్టి రక్త స్రావం జరగకుండా కాపాడాలి. అధిక రక్తస్రావం ఆపడానికి ఏవైనా దుస్తులు ఉంటే వాటితోనే బ్యాండేజ్ చేయాల్సి ఉంటుంది.

గాయాన్ని శుభ్రపరచడం ఎలా..?:

గాయాన్ని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. మీ గాయంపై బ్యాక్టీరియా సోకకుండా ఉండేందుకు గాయాన్ని తాకడానికి స్టెరిలైజ్డ్ నీటితో శుభ్రం చేసి, యాంటిసెప్టిక్ క్రీమ్ రాయాలి. రక్తస్రావం అయినట్లయితే బ్యాండేజ్ తో రక్తం కారే ప్రదేశంలో అప్లై చేయాలి. గాయం నయం అయ్యే వరకు కనీసం రోజుకు ఒకసారి బ్యాండేజీ మార్చండి.

స్పృహ కోల్పోయినప్పుడు ఏం చేయాలి:

తీవ్రమైన ఉక్కిరిబిక్కిరి కారణంగా మాట్లాడలేకుండా, శ్వాస తీసుకోలేని పరిస్థితితో వ్యక్తి స్పృహ కోల్పోవచ్చు. శ్వాసనాళాల్లో ఏదైనా అడ్డంకి కలిగినప్పుడు వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయాలి. తద్వారా మెదడు దెబ్బతినకుండా నిరోధించవచ్చు. ఉక్కిరిబిక్కిరి అవుతున్న రోగి వెనుక నిలబడి, మీ చేతులను వారి నడుము చుట్టూ చుట్టండి. పక్కటెముకలను గట్టిగా ప్రెజర్ చేయడం ద్వారా శ్వాస విడుదల అవుతుంది. లేదా పడుకోబెట్టి నోటి ద్వారా గాలిని ఊదాలి. అప్పుడు శ్వాస నాళాల్లో ఏదైనా అడ్డంకి ఉంటే విడుదల అవుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..