AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Superfoods : ఈ ఏడు ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే, జీవితంలో కళ్లద్దాల అవసరం మీకు రాదు…

ఈ డిజిటల్ యుగంలో గ్యాడ్జెట్స్ దెబ్బకు కళ్లు ఎఫెక్ట్ అవుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరిలోనూ చూపు సంబంధిత సమస్యలు వస్తున్నాయి.

Superfoods : ఈ ఏడు ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే, జీవితంలో కళ్లద్దాల అవసరం మీకు రాదు...
Eyes Health
Madhavi
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 28, 2023 | 11:31 AM

Share

ఈ డిజిటల్ యుగంలో గ్యాడ్జెట్స్ దెబ్బకు కళ్లు ఎఫెక్ట్ అవుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరిలోనూ చూపు సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం 24 గంటల పాటు స్మార్ట్ ఫోన్ యాక్సెస్‌ని కలిగి ఉండటం ప్రమాదాన్ని పెంచుతోంది. ముఖ్యంగా కంప్యూటర్ అతిగా వాడటం వల్ల మీ కంటి ఆరోగ్యం మరింత దిగజార్చుతుంది. మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి దృష్టి, పొడి కళ్ళు, కంటిశుక్లం మొదలైన సమస్యలను నివారించడానికి ఆయుర్వేద పద్ధతులపై ఓ సారి దృష్టి సారిద్దాం. మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే ఏడు ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం.

త్రిఫల:

త్రిఫల అనేది మీ చూపును పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. త్రిఫలను నీటిలో కలిపి కళ్లను వాష్ చేసుకుంటే చాలు, మీ కళ్ళ కండరాలను బలపరుస్తుంది. మీ చూపును మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

రోజ్ వాటర్:

రోజంతా అలసిన కళ్లకు విశ్రాంతిని అందించడానికి, రోజ్ వాటర్‌ని ఉపయోగించవచ్చు. ఇది మీ కళ్ళలో మంటను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పడుకునే ముందు రోజ్ వాటర్ లో అద్దిన కాటన్ బాల్స్ ను కళ్లపై పెట్టుకుంటే చాలా మంచిది.

ద్రాక్ష:

ద్రాక్ష అనేది ఆయుర్వేద మూలిక, ఇది మీ కళ్ళలో చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది శరీరానికి చలవను అందిస్తుంది. ఇందులో ఉండే ఆంథోసైనిన్, యాంటీఆక్సిడెంట్లు మీ కళ్లకు తేమను అందిస్తాయి.

ఉసిరి రసం:

మీ కంటి చూపును మెరుగుపరచడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి మీరు ఉసిరి రసం త్రాగాలి. మీరు కంటి చూపును పెంపొందించడానికి ఉసిరి నూనెతో మీ కళ్ళ చుట్టూ మసాజ్ చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది.

బ్రహ్మి:

బ్రహ్మి అనేది మీ కంటి రక్తనాళాలను సడలించడంలో సహాయపడుతుంది. ఇది ఒక ప్రభావవంతమైన హెర్బ్. అంతేకాకుండా, ఇది మీ దృష్టిని మెరుగుపరుస్తుంది మెమరీ బూస్టర్‌గా సైతం పనిచేస్తుంది.

అలోవెరా జ్యూస్:

కలబందలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాటన్ బాల్స్ సహాయంతో కలబంద రసాన్ని మీ కళ్ళకు రాసుకోవచ్చు. ఇది కంటి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఫుట్ మసాజ్:

పదాభ్యంగ అనేది మీ కళ్ల దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడే ఫుట్ మసాజ్ థెరపీ. ఇది మంచి నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది. నిద్ర లేకపోవడం వల్ల మీ కంటి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి 4 ఆయుర్వేద చిట్కాలు:

మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు అనుసరించాల్సిన కొన్ని చిట్కాలు క్రింది విధంగా ఉన్నాయి:

కళ్ళు కడగడానికి చల్లని నీటిని ఉపయోగించండి:

ఉదయాన్నే కళ్లను కడగడానికి చల్లటి నీటిని ఉపయోగించాలి. మీ కళ్ళ నుండి ధూళిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. అదనంగా, ఇది మీ కళ్ళను హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.

వ్యాయామం:

సూర్య నమస్కారం, ప్రాణాయామం మొదలైన సులభమైన వ్యాయామాలను చేయడం ద్వారా మీరు మీ కంటి ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ఇది మీ కళ్ళకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.

హెడ్ మసాజ్:

తలకు క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మీ కంటి ఒత్తిడి నుండి మీకు ఉపశమనం లభిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..