Health tips: ఈ పండ్లు తింటే శరీరంలో కొవ్వు ఎంతో సులభంగా కరిగిపోతుంది..

శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువుగా ఉంటే అది గుండె సంబంధిత వ్యాధులతో పాటు, మధుమేహనికి దారితీయవచ్చు. అందుకే శరీరంలో అవసరమైన మేరకు మినహయిస్తే అధిక కొవ్వును కరిగించుకోవడం..

Health tips: ఈ పండ్లు తింటే శరీరంలో కొవ్వు ఎంతో సులభంగా కరిగిపోతుంది..
High Cholesterol
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 15, 2022 | 11:07 AM

Health Tips: శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువుగా ఉంటే అది గుండె సంబంధిత వ్యాధులతో పాటు, మధుమేహనికి దారితీయవచ్చు. అందుకే శరీరంలో అవసరమైన మేరకు మినహయిస్తే అధిక కొవ్వును కరిగించుకోవడం ఇంపార్టెంట్. శారీరక శ్రమ ద్వారా కొంత కొవ్వు కరుగుతుంది. అయితే కొన్ని రకాల పండ్లు తినడం ద్వారా కూడా శరీరంలో కొలెస్ట్రాల్ ను సులభంగా కరిగిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో మారుతున్న లైఫ్ స్టైల్ తో పాటు చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. పొట్ట, పిరుదులు, నడుము భాగాల్లో కొవ్వు పేరుకుపోయి చాలా ఆరోగ్య సమస్యలకు దారితీసస్తుంది. శరీరాకృతి మారేంత వరకు లేదా బరువు పెరిగే వరకు ఈ సమస్య ఉన్నట్లు మనకు తెలియదు. ముఖ్యంగా తినే ఆహారం, మన జీవనశైలి కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక రుగ్మతలకు ఈ అధిక కొలెస్ట్రాల్ దారితీయవచ్చు. శరీరంలో కొవ్వు అధికమైనప్పుడు కొన్ని లక్షణాలు శరీరంలో కనిపిస్తాయి. తరచుగా వికారంగా ఉండటం, అధిక రక్తపోటు, ఛాతీలో భారం, బరువు పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన అలసట.. ఇవన్నీ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలే. అలాగే కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో మనం తీసుకునే ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు సమతుల్యమైన ఆహారంతో పాటు ఐదు రకాల పండ్లను తింటే అధిక కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

టొమాటో: సాధారణంగా టొమాటోను కూరగాయగా పరిగణించినా.. ఇది ఒక పండు కూడా. టొమాటోలో ఎ, బి, సితో పాటు కె విటమిన్లు ఉన్నాయి. ఇవి అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. టొమాటోలు తినడం ద్వారా గుండెకు మేలు కలుగుతుంది.

బొప్పాయి: ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లలో బొప్పాయి ఒకటి. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆకస్మిక గుండెపోటును నివారించాలంటే పచ్చి బొప్పాయిని ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉండాలి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బొప్పాయిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఎక్కువుగానే ఉంటాయి. బొప్పాయి తినడం ద్వారా విటమిన్లు బి, సి, ఇ లభిస్తాయి. పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం వంటి కీలక మూలకాలు బొప్పాయి తినడం ద్వారా శరీరానికి అందుతాయి.

ఇవి కూడా చదవండి

అవకాడో: కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి అవకాడోను సమృద్ధిగా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక మీడియం సైజ్ అవోకాడోలో 96 కేలరీలు, 6 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వు, 4 గ్రాముల ఫైబర్ ఉంటాయని నిపుణుల అంచనా.

సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మ, బత్తాయి వంటి పండ్లు సిట్రస్ పండ్ల జాబితాలోకి వస్తాయి. వీటిలో Vitamin-C పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.

పుచ్చకాయ: పుచ్చకాయ ఒక రిఫ్రెషింగ్ పండు. డైటీషియన్ల గైడెన్స్ ప్రకారం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఈపండు సహాయపడుతుంది. పుచ్చకాయలో లైకోపీన్, కెరోటినాయిడ్ వంటి సమ్మేళనాలు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేస్తుంది, తద్వారా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..