Women Health: ఇది తీసుకుంటే పురుషుల్లో శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుందట.. మరి మహిళల్లో..
పురుషులైనా, మహిళలైనా శృంగార సామర్థ్యం పెంచుకోవడానికి కొన్ని సందర్భాల్లో ఔషదాలు వాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో అవి మంచి ఫలితాలినస్తే.. మరి కొన్నిసార్లు నిరాశపరుస్తూ ఉంటాయి. మరికొంతమంది..
Shilajit Benefits: పురుషులైనా, మహిళలైనా శృంగార సామర్థ్యం పెంచుకోవడానికి కొన్ని సందర్భాల్లో ఔషదాలు వాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో అవి మంచి ఫలితాలినస్తే.. మరి కొన్నిసార్లు నిరాశపరుస్తూ ఉంటాయి. మరికొంతమంది వైద్యులు, నిపుణుల సలహాతో శృంగార సామర్థ్యాన్ని పెంచుకునేందుకు మెడిసిన్స్ వాడతారు, అయితే పురుషుల్లో స్టామినా పెంచుకోవడానికి ఆయుర్వేద మూలికా వైద్యంలో శిలాజిత్ అనే ఔషధాన్ని కొన్ని సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇదే మూలిక పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. మహిళలకు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అన్ని మూలికలకంటే శిలావత్ మూలికను శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. పురాతన కాలం నుండి దీనిని పురుషుల లైంగిక శక్తిని పెంచడానికి ఉపయోగిస్తూ వస్తున్నారు. శిలాజిత్ పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది. అంతేకాదు, అలసటను తొలగించటం నుంచి తక్కువ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి సమస్యల వరకు అనేక రకాల చికిత్సల కోసం సాంప్రదాయ మూలికా వైద్యంలో ఈ మూలికను ఉపయోగిస్తారు. మరోవైపు శిలాజిత్ మూలిక స్త్రీల సెక్స్ సంబంధిత సమస్యలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
శిలాజిత్ అనేది ఒక జిగట పదార్థం. హిమాలయాల్లోని శిలల్లో లభిస్తుంది. అందుకే దీనిని శిలాజిత్ అని పిలుస్తున్నారు. దీనిని ఆయుర్వేద వైద్యంలో ఒక ఔషధంగా ఉపయోగిస్తారు. శృంగార సామర్థ్యాన్ని పెంచటానికి, లైంగిక జీవితాన్ని మెరుగుపరచటానికి శిలాజిత్ ఔషధాన్ని మోతాదు మేరకు అందిస్తారు. ఇది తీసుకున్నప్పుడు అలసట, బద్ధకం పోయి ఉత్సాహం ఉరకలేస్తుందని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. మరి పురుషులతో పాటు మహిళలకు ఈశిలాజిత్ మూలిక ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
ఎనర్జీని పెంచుతుంది: ఇంటి పనులతో మహిళలు తరచుగా అలసిపోతూ ఉంటారు. స్త్రీల పీరియడ్ సమయంలో తమ శరీరం నుండి చాలా పోషకాలను, శక్తిని కోల్పోతారు. అటువంటప్పుడు శిలాజిత్ మూలిక తీసుకుంటే అది శరీరంలో అడెనోసిన్-5-ట్రిఫాస్ఫేట్ -ATPని ఉత్పత్తి చేస్తుంది. దీంతో శక్తి తిరిగి వస్తుంది. అంతేకాకుండా మంచి మూడ్ లోనూ ఉంటారు, రోజంతా చురుకుగా ఉండేందుకు ఈమూలిక దోహదపడుతుంది.
సంతానోత్పత్తి: నెలసరి సమస్యలతో చాలా మంది మహిళలు బాధపడుతూ ఉంటారు. ఈసమస్యల వల్ల స్త్రీలు వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం ఉంది. అయితే ఆయుర్వేద వైద్యం తీసుకున్నప్పుడు మహిళల్లో సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి శిలాజిత్‌ను సిఫార్సు చేస్తున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. శిలాజిత్ మూలిక అవసరమైన యాంటీఆక్సిడెంట్లను ఉత్పత్తి చేయడం ద్వారా అవయవాలను శుభ్రపరుస్తుంది. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది, స్త్రీలలో వంధ్యత్వాన్ని నివారిస్తుంది.
ఒత్తిడి తగ్గుతుంది: శిలాజిత్ మూలిక అరుదైన వైద్య లక్షణాలకు ప్రసిద్ధి. దీనిని తినడం వల్ల ప్రశాంతత పొందవచ్చు. ఇది ఆనందంగా ఉన్నప్పుడు శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. అదే సమయంలో ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించడం ద్వారా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిని మంచి, ఉల్లాసమైన, సంతోషకరమైన మూడ్‌లో ఉంచుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడే శక్తి శరీరంలో లేకుంటే, వైరస్‌లు, బాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని హరించివేస్తాయి. ఈ శిలాజిత్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అనారోగ్యం బారిన పడకుండా నిరోధిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..