పొద్దున్నే ఈ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు..!
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉసిరికాయ, బీట్‌రూట్ జ్యూస్ చాలా మంచిది. ఈ రెండూ కలిపి తాగితే మన శరీరానికి విటమిన్ సి, ఐరన్, పీచుపదార్థాలు లాంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి. దీని వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ జ్యూస్ ను రోజూ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఆరోగ్యానికి హెల్ప్ చేసే కొన్ని సహజాహారాల్లో ఉసిరికాయ, బీట్‌రూట్ జ్యూస్ ఒక్కటి. ఈ రెండు పదార్థాలు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. వీటిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. ఇప్పుడు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
విటమిన్ C పవర్ హౌస్
ఆమ్లా బీట్‌రూట్ రెండింటిలోనూ విటమిన్ C యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను శక్తివంతం చేసి వైరస్ లు, ఇతర హానికర సూక్ష్మజీవుల నుంచి రక్షణ కలిగిస్తాయి. వాతావరణ మార్పుల వల్ల వచ్చే జబ్బులకు తగిన రక్షణను అందించడంలో ఈ జ్యూస్ హెల్ప్ చేస్తుంది.
జీర్ణక్రియకు ఆమ్లా, బీట్ రూట్
ఆమ్లా, బీట్‌రూట్ జ్యూస్‌లో డైటరీ ఫైబర్ ప్రధానంగా ఉంటుంది. ఇది ఆహారం సరైన విధంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్ధకాన్ని నివారించడమే కాకుండా.. పేగులలో మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహకరిస్తుంది. దీర్ఘకాలిక జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందాలనుకునే వారికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది.
గుండె ఆరోగ్యం
బీట్ రూట్ లో సహజంగా ఉండే నైట్రేట్‌లు రక్తనాళాలను విశాలంగా చేసి రక్తప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే పొటాషియం కూడా ఎక్కువగా ఉండటం వలన రక్తపోటు కంట్రోల్ లో ఉండేలా చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల అవకాశాలను తగ్గించడంలో ఈ జ్యూస్ హెల్ప్ అవుతుంది.
ఐరన్ రిచ్ జ్యూస్
ఈ జ్యూస్‌లో ఉన్న ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల రక్తహీనతను ఎదుర్కోవడం ఈజీ అవుతుంది. తరచూ అలసటగా ఉండే వారికి శరీర బలహీనతతో బాధపడే వారికి ఇది మంచి సహాయంగా ఉంటుంది.
బరువు నియంత్రణకు..
ఈ జ్యూస్‌లో కేలరీలు తక్కువగా ఉండటం వలన ఇది డైట్‌లో చేర్చడానికి అనుకూలంగా ఉంటుంది. పైగా ఇందులో ఫైబర్ అధికంగా ఉండటంతో ఎక్కువసేపు తిన్నట్లే ఫీలింగ్ కలుగుతుంది. ఆకలి త్వరగా కాకుండా ఉండటంతో అధికాహారం తీసుకునే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది సహాయకారిగా నిలుస్తుంది.
చర్మ సౌందర్య రహస్యం
విటమిన్ C యాంటీ ఆక్సిడెంట్ల సమ్మేళనం చర్మంపై శుభ్రతను తీసుకురావడమే కాకుండా.. మచ్చలు, ముడతల లాంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ జ్యూస్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇలా ఉదయం ఆమ్లా, బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




