AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Patients: షుగర్ ఉన్నవారు పండ్లు తినొచ్చా.. తింటే ఎలాంటి పండ్లు తినాలి..?

ప్రస్తుత జీవన విధానంతో 60 ఏళ్లకు రావాల్సిన షుగర్ వ్యాధి ఇరవై, ముప్పై ఏళ్లకే వస్తుంది. అధిక బరువు ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది...

Sugar Patients: షుగర్ ఉన్నవారు పండ్లు తినొచ్చా.. తింటే ఎలాంటి పండ్లు తినాలి..?
Fruits
Srinivas Chekkilla
|

Updated on: Mar 07, 2022 | 3:54 PM

Share

ప్రస్తుత జీవన విధానంతో 60 ఏళ్లకు రావాల్సిన షుగర్ వ్యాధి ఇరవై, ముప్పై ఏళ్లకే వస్తుంది. అధిక బరువు ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది. అతేకాకుండా వారసత్వ పరంగా కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ఇక స్వీట్లని ఇష్టపడే వారు మధుమేహ బాధితులలో చాలామంది ఉంటారు. అలాంటి వారు సహజసిద్దమైన ఆహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. సాధారణంగా డయబెటీస్ పేషెంట్లు పండ్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. కానీ పూర్తిగా పండ్లకి మాత్రం దూరమైతే వాటి నుంచే వచ్చే పోషకాలు కూడా దూరమవుతాయి. ఇక అందుకోసం పండ్లని తినాలి. అయితే అతిగా తినకూడదు. అన్నీ పండ్లు తినకూడదు. సీతాఫలల్లో చక్కెర స్థాయిలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే షుగర్ పేషెంట్లు ఈ పండుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దానిమ్మ మధమేహ రోగులకు మంచి ఆహారం. అలా అని దాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకు ఒక కాయ తింటే చాలు రక్తంలో చక్కెరను ఈజీగా నియంత్రిస్తుంది. అలాగే అరటిపండు బరువు తగ్గడం, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

అయితే అరటి పండులోనూ చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు అరటిపండును పూర్తిగా తినడకుండా సగం ముక్కని తీసుకుంటే చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. యాపిల్ పండు విషయానికి వస్తే.. మిగిలిన పండ్లన్నింటిలో కంటే కూడా ఈ యాపిల్‌ పండ్లలో పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి. యాపిల్ పండు కొలెస్ట్రాల్ నిలువలు తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా శుభ్రం చేస్తుంది. అయితే డయాబెటీస్‌ రోగులు రోజుకు ఒక యాపిల్ తింటే వారికి ఎలాంటి సమస్యలు ఉండవు. అంతకు మించి ఎక్కువ తింటే మాత్రం అనేక సమస్యలు ఎదురవుతాయి.

ఇక బొప్పాయి గుండె జబ్బుల నుంచి పూర్తిగా రక్షిస్తుంది. అలాగే షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. ఇంకా కాన్సర్ వ్యాధి కూడా రాకుండా నిరోధిస్తుంది. అయితే బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో అతిగా తీసుకుంటే అంతే చెడు చేస్తుంది. షుగర్ పేషెంట్లు బొప్పాయి పండుని మాత్రం మితంగా తీసుకోవాలి. షుగర్ ఉన్నవారు చక్కెర స్థాయి అధికంగే ఉండే పండ్లను తీసుకోకపోవడం మంచింది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Read Also.. Health: మీరు నైట్ డ్యూటీ చేస్తున్నారా.. అయితే మీకు గుండెపోటు, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది..