Home Remedies: మొలకెత్తిన మెంతుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు.. అనేక అనారోగ్యాలకు చక్కటి పరిష్కారం
మెంతుల్లో ఆరోగ్యానికి మేలు చేసే సహజసిద్ధ ఔషధ గుణాలుంటాయి. అందుకే వాటి గురించి తెలిసిన వారంతా మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటారు. ఇలా తినడం వల్ల ముఖ్యంగా మోకాళ్లనొప్పులు త్వరగా రాకుండా ఉంటాయి. మెంతుల్లో ఉండే జిగురు నొప్పులు రాకుండా నివారిస్తుంది. ఇంకా మెంతుల్లో క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్, కాపర్, పొటాషియం వంటి పోషకాలుంటాయి. మొలకెత్తిన మెంతులు తీసుకోవడం..

మెంతుల్లో ఆరోగ్యానికి మేలు చేసే సహజసిద్ధ ఔషధ గుణాలుంటాయి. అందుకే వాటి గురించి తెలిసిన వారంతా మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటారు. ఇలా తినడం వల్ల ముఖ్యంగా మోకాళ్లనొప్పులు త్వరగా రాకుండా ఉంటాయి. మెంతుల్లో ఉండే జిగురు నొప్పులు రాకుండా నివారిస్తుంది. ఇంకా మెంతుల్లో క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్, కాపర్, పొటాషియం వంటి పోషకాలుంటాయి. మొలకెత్తిన మెంతులు తీసుకోవడం ఆరోగ్యానికి మరింత మంచిదంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
-మొలకెత్తిన మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతాయి. డయాబెటిక్ పేషంట్లు ప్రతిరోజూ ఉదయం మొలకెత్తిన మెంతులు తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. మొలకెత్తిన మెంతులను డైరెక్ట్ గా తినలేకపోతే.. సలాడ్ లలో కలిపి తీసుకోవచ్చు.
-మొలకెత్తిన మెంతులు .. కండరాలు, కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లను అందిస్తాయి. ముఖ్యంగా వీటిలో ఉండే గెలాక్టోమన్నన్ ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.
-మొలకెత్తిన మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా రక్షిస్తాయి.
-అలాగే వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, టానిన్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతాయి.
-మొలకెత్తిన మెంతులను రోజూ తినడం వల్ల శరీరంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ స్థాయిలు మెరుగుపడతాయి. వీటిలో ఉండే పొటాషియం హైపర్ టెన్షన్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.
-ప్రతిరోజూ మొలకెత్తిన మెంతులను తినడం వల్ల గుండెపోటుకు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అసిడిటీ, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలను నివారిస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి