Period Pain: పీరియడ్స్ నొప్పిని భరించలేకపోతున్నారా? అసలు కారణం ఇదే.. ఈ టిప్స్ పాటిస్తే రిలీఫ్..
పీరియడ్స్.. మహిళలను చాలా మందికి ఇబ్బందులు కలుగుజేస్తుంది. ముఖ్యంగా టీనేజర్స్ కి. ఆ సమయంలో వచ్చే నొప్పిని భరించలేక చాలా అవస్థలు పడతారు

పీరియడ్స్.. మహిళలను చాలా మందికి ఇబ్బందులు కలుగుజేస్తుంది. ముఖ్యంగా టీనేజర్స్ కి. ఆ సమయంలో వచ్చే నొప్పిని భరించలేక చాలా అవస్థలు పడతారు. సాధారణంగా ఈ నొప్పి మోనార్చ్ నుంచి మోనోపాజ్ వరకూ ఉంటుంది. ప్రతి పది మందిలో తొమ్మిది మంది పీరియడ్స్ సమయంలో నొప్పిని అనుభవిస్తారు. అయితే చాలా మందిలో అది భరించగలినంత ఉంటుంది. కానీ కొంత మందిలో భరించలేనంతగా ఉంటుంది. ప్రతి నెలా కూడా ఆ నొప్పి తీవ్రత మరింత పెరుగుతుంది. ఇది కొన్ని ఆరోగ్య పరిస్థితులను బట్టి సంభవిస్తూ ఉంటుంది. అటువంటి వారి కోసమే సాధారణంగా పీరియడ్స్ సమయంలో అధిక నొప్పిని కలిగించే ఆరోగ్య పరిస్థితులు.. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అందుబాటులో ఉన్న చికిత్స విధానాలపై వైద్య నిపుణులు చెబుతున్న విషయాలను ఇప్పుడు చూద్దాం..
ఎండోమెట్రియోసిస్: ఇది గర్భాశయంలోని లైనింగ్ కణాలు ఫెలోపియన్ ట్యూబ్‌లు, పెల్విస్ టిష్యూ లైనింగ్ , అండాశయాలలో కనిపిస్తుంది. సాధారణంగా ఇది రక్తంతో నిండిన తిత్తులు, అంతర్గత రక్తస్రావం, కొన్ని సందర్భాల్లో ప్రేగుల్లో వాపు కారణంగా వస్తుంది.
చికిత్స: దీని నివారణకు క్రమం తప్పకుండా యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్ సాధన చేయాలి. పసుపు, ఆకుకూరలు, బ్లూబెర్రీస్, అల్లం మొదలైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారాలను తీసుకోడానికి ప్రయత్నించాలి. పీరియడ్స్ వచ్చే ముందు వైద్యుల సూచన మేరకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులను కూడా తీసుకోవచ్చు.
పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ (PID): చికిత్స చేయని లైంగికంగా సంక్రమించిన ఇన్ఫెక్షన్ల (STI) కారణంగా ఏర్పడే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి. ఈ సమయంలో వాపు, బాధాకరమైన రుతు తిమ్మిరి, మచ్చలు, వంధ్యత్వం మొదలైన లక్షణాలతో స్త్రీ పునరుత్పత్తి మార్గాన్ని ప్రభావితం చేస్తాయి.
చికిత్స: PID ప్రారంభ దశల్లో చికిత్సకు యాంటీబయాటిక్స్ సహాయపడతాయి. పైన పేర్కొన్న లక్షణాల విషయంలో సురక్షితమైన సెక్స్‌ను ప్రాక్టీస్ చేయండి, లైంగికంగా సంక్రమించే వ్యాధుల గురించి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోండి.
గర్భాశయ ఫైబ్రాయిడ్లు: ఇవి గర్భాశయంలో పెరిగే నాన్ కాన్సర్ కణితులు. మైక్రోస్కోపిక్ సైజు నుండి గర్భాశయం ఆకారాన్ని మార్చేంత పెద్దవిగా ఉంటాయి. ఇది కొందరికి ఇబ్బంది కలిగించక పోయినప్పటికీ, ఫైబ్రాయిడ్లు కొందరిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
చికిత్స: పెల్విక్ కండర మసాజ్‌లు వాటిని సడలించడంలో సహాయపడతాయి. వాపు తగ్గడానికి ఉపకరిస్తాయి. వెచ్చని నీటితో స్నానం కూడా చికిత్సగా ఉంది. పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి, పెద్ద పరిమాణంలో రక్తం గడ్డకట్టడం వంటివి ఎదురైతే నిపుణుడిని సంప్రదించాలి.
కాపర్ IUD (గర్భశయాంతర పరికరం): ఇది 10 సంవత్సరాల వరకు గర్భం రాకుండా నిరోధించడానికి ఉపయోగించే తాత్కాలిక, నాన్-హార్మోనల్ ప్రెగ్నెన్సీ నిరోధక పరికరం. అయితే అవి లోపల పెట్టిన తర్వాత పీరియడ్స్ సమయంలో నొప్పిని కలిగిస్తాయి.
చికిత్స: IUD లోపల పెట్టినప్పటి నుంచి ఎక్కవ కాలం పాటు పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పిని ఎదుర్కొంటే, వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం.
మరికొన్ని చిట్కాలు..
వాస్తవానికి పీరియడ్స్ నొప్పికి నిపుణుల నిర్ధారణ, చికిత్సకు వేరే ప్రత్యామ్నాయం లేదు. అయితే స్వల్పకాలిక సౌలభ్యం కోసం ఇంటి చిట్కాలు మేలు చేస్తాయి. వ్యాధిపై అవగాహన కల్పిస్తాయి.
- పెల్విక్ ప్రాంతంలో హీటింగ్ ప్యాడ్ ఉపయోగించడం
- రెగ్యులర్ ఫిట్‌నెస్ విధానాన్ని నిర్వహించడం
- ఫంక్షనల్ ఫుడ్స్
- మల్టీవిటమిన్స్ సప్లిమెంట్లను రెగ్యులర్ గా తీసుకోవడం
- ఉప్పు, కెఫిన్, చక్కెర మొదలైన వాటిని తగ్గించడం
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం..