Telugu News » Photo gallery » Eating Too Much Of Eggs can be cause for these health problems check here for more details
Eggs Side Effects: గుడ్లను ఎక్కువగా తింటే ఈ 5 సమస్యలు తప్పవు.. గుండెకు మరీ ప్రమాదం..!
శివలీల గోపి తుల్వా |
Updated on: Jan 25, 2023 | 7:08 PM
Eggs Side Effects: ప్రోటీన్, విటమిన్లు సమృద్ధిగా ఉండే గుడ్లు శరీరానికి ఎంతగానో ఉపయోగకరమైనవి. శరీరానికి కావలసిన శక్తినిచ్చే గుడ్లలో ఉపయోగకరమైన గుణాలు చాలా ఉన్నప్పటికీ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ప్రమాదం. గుడ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Jan 25, 2023 | 7:08 PM
చాలామంది తమ రోజును గుడ్డు బ్రేక్ ఫాస్ట్ తో ప్రారంభిస్తారు. ప్రోటీన్, విటమిన్లు సమృద్ధిగా ఉండే గుడ్లు శరీరానికి ఎంతగానో ఉపయోగకరమైనవి. శరీరానికి కావలసిన శక్తినిచ్చే గుడ్లలో ఉపయోగకరమైన గుణాలు చాలా ఉన్నప్పటికీ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు అంటున్నారు.
1 / 8
వారి ప్రకారం కొన్ని రకాల వ్యాధులలో బాధపడేవారు గుడ్లు తినడం చాలా హానికరం. చాలా మంది ప్రజలు చలికాలంలో ఆరోగ్యంగా ఉండడానికి గుడ్లు తింటారు. కొన్నిసార్లు వాటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది వారి శరీరానికి హాని కలిగిస్తుంది. అంతకాక అనేక వ్యాధులు పెరిగే ప్రమాదం కూడా తలెత్తుతుంది.
2 / 8
మన గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ స్థాయి ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండటం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో ఎక్కువ గుడ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
3 / 8
గుడ్లు అధికంగా తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. గుడ్లను తిన్న తర్వాత జీర్ణవ్యవస్థ క్షీణిస్తుంది. గుడ్లు తినడం వల్ల కొన్నిసార్లు అజీర్ణం, వాంతులు, వికారం, తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి.
4 / 8
చలికాలంలో చాలా మంది గుడ్లు ఎక్కువగా తింటారు. ఆమ్లెట్‌లో లేదా ఏదైనా విధంగా ఉడకబెట్టిన తర్వాత గుడ్లను తీసుకుంటారు. నివేదికల ప్రకారం రోజుకు 4 కంటే ఎక్కువ గుడ్లు తినడం శరీరంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది గుండె జబ్బులను ప్రేరేపించే ప్రమాదాన్ని పెంచడంతో పాటు శరీరం ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది.
5 / 8
గుడ్లు తిన్న తర్వాత మొటిమల సమస్య చాలా మంది ముఖంలో కనిపిస్తుంది. గుడ్డు తిన్న తర్వాత హార్మోన్లలో మార్పు కారణంగా ఇది జరుగుతుంది.
6 / 8
గుడ్డులో ప్రొజెస్టెరాన్ ఉంటుంది.దీనితో పాటు గుడ్డులోని తెల్లసొనలో అల్బుమిన్ ఉంటుంది. ఇది సులభంగా జీర్ణం కాదు. దీని కారణంగా అనేక దుష్ప్రభావాలు కనిపిస్తాయి.
7 / 8
గుడ్లను ఎక్కువ పరిమాణంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.