AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువతలో రోజురోజుకీ మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది.. సోషల్ మీడియానే ఇందుకు కారణమా

ఘజియాబాద్ సిటీ హాస్పిటల్‌లోని సైకియాట్రీ విభాగానికి చెందిన డాక్టర్ ఎ.కె. కుమార్ మాట్లాడుతూ.. యువత అర్థరాత్రి వరకు స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్నారని.. దీని వల్ల వారి రొటీన్ సిస్టమ్ దెబ్బతింటుందని కుమార్ చెప్పారు. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మనకు తగినంత నిద్ర లభించదని అప్పుడు మనసు చికాకుగా మారుతుందని డాక్టర్ కుమార్ వివరిస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను అర్థరాత్రి వరకు ఉపయోగించడం వల్ల కళ్లలో నిద్రకు కారణమైన మెలోటోనియం హార్మోన్ విడుదల కాదు. 

యువతలో రోజురోజుకీ మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది.. సోషల్ మీడియానే ఇందుకు కారణమా
Youth Mental HealthImage Credit source: freepic
Surya Kala
|

Updated on: May 23, 2024 | 7:09 PM

Share

రోజు రోజుకీ ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరుగుతుంది. అంతేకాదు వీటివలన పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా సోషల్‌ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. నేటి డిజిటల్ యుగంలో, సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. యువ తరం సోషల్ మీడియాలో గంటలు గడుపుతోంది. ఎంతగా అంటే ఒకే ఇంట్లో ఉన్నా సరే తమ ఫ్యామిలీతో మాట్లాడాలంటే సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. అవును స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి, సమాచారాన్ని పొందేందుకు, వినోదం పొందడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే దీని ఉపయోగం చెడు ప్రభావాలను కూడా కలిగిస్తుందని మీకు తెలుసా..! ముఖ్యంగా మానసిక ఆరోగ్యం విషయంలో చెడు ప్రభావం కలుగుతుంది. యువతలో ఒత్తిడికి సోషల్ మీడియా ప్రధాన కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

సోషల్ మీడియా మానసిక ఒత్తిడిని ఎలా కలిగిస్తుందంటే?

సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు వారు తమ పని, చదువులు, స్నేహం, కుటుంబ సంబంధాలు వంటి ఇతర కార్యకలాపాల నుండి డిస్‌కనెక్ట్ కావడం ప్రారంభిస్తారు. ఈ పరిస్థితి వారిని ఒంటరిగా చేస్తుంది. మానసిక ఒత్తిడికి గురవుతారు. తరచుగా నెట్టింట్లో ఇతరుల సంతోషకరమైన జీవితాల చిత్రాలను చూస్తూ ఉంటారు. అప్పుడు వారిలో తాము కూడా అలా మారాలనే కోరికను కలిగిస్తుంది. అయినప్పటికీ సోషల్ మీడియాకు అడిక్ట్ అవడంతో తమ మనస్సును నియంత్రించలేరు. యువత తమను తాము ఇతరులతో పోల్చుకోవడం ప్రారంభిస్తుంది, ఇది వారిలో ఆత్మ న్యూనతను, ఒత్తిడిని కలిగిస్తుంది.

ఘజియాబాద్ సిటీ హాస్పిటల్‌లోని సైకియాట్రీ విభాగానికి చెందిన డాక్టర్ ఎ.కె. కుమార్ మాట్లాడుతూ.. యువత అర్థరాత్రి వరకు స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్నారని.. దీని వల్ల వారి రొటీన్ సిస్టమ్ దెబ్బతింటుందని కుమార్ చెప్పారు. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మనకు తగినంత నిద్ర లభించదని అప్పుడు మనసు చికాకుగా మారుతుందని డాక్టర్ కుమార్ వివరిస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను అర్థరాత్రి వరకు ఉపయోగించడం వల్ల కళ్లలో నిద్రకు కారణమైన మెలోటోనియం హార్మోన్ విడుదల కాదు.

ఇవి కూడా చదవండి

FOMO (తప్పిపోతాననే భయం)

  1. సోషల్ మీడియా నిరంతరం వాడుతున్నట్లు అయితే మనం ఏదో కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. FOMO అని పిలువబడే ఈ భయం మానసిక ఒత్తిడి, ఆందోళనను కలిగిస్తుంది.
  2. ఒకొక్కసారి సైబర్ బెదిరింపులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  3. చాలా సార్లు యువత ఆన్‌లైన్ వేధింపులు, సోషల్ మీడియాలో బెదిరింపులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇది వారిలో మానసిక ఒత్తిడిని సృష్టిస్తుంది.
  4. నిద్ర లేమిని కలిగిస్తుంది.
  5. రాత్రిపూట సోషల్ మీడియాను ఉపయోగించడం వల్ల నిద్ర లేమి, అలసట, చిరాకు, ఏకాగ్రత లోపానికి దారితీస్తుంది. ఇవన్నీ ఒత్తిడికి సంబందించిన అన్ని లక్షణాలు.
  6. ద్వేషపూరిత ప్రసంగం, తప్పుడు కంటెంట్
  7. ప్రస్తుతం సోషల్ మీడియాలో అసభ్యత, తప్పుడు వార్తలు సర్వసాధారణంగా మారాయి. దీని కారణంగా యువత వాస్తవ ప్రపంచంతో సంబంధాన్ని కోల్పోతున్నారు. తమని తాము సామాజిక ఒంటరిగా భావిస్తారు. ఇది ఒత్తిడిని పెంచుతుంది.

సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి పరిష్కారాలు ఏమిటి?

  1. ఒక రోజు లేదా వారంలో సోషల్ మీడియాలో ఎంత సమయం వెచ్చించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. దానికి కట్టుబడి ఉండండి.
  2. కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపండి.
  3. వ్యక్తులు తరచుగా తమ ఉత్తమ జీవితాన్ని సోషల్ మీడియాలో చూపిస్తారు. కనుక మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానుకోండి.
  4. మీకు భంగం కలిగించే వార్తలు, పోస్ట్‌లకు దూరంగా ఉండండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..