Ganga Dussehra 2024: గంగా దసరా రోజున శుభ యోగాలు.. నదీ స్నానం, పూజతో గంగాదేవి, శివుడి ఆశీర్వాదం మీ సొంతం..
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం గంగా దసరా రోజున అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రత్యేక రోజున సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి, ఇవి పూజకు ఉత్తమమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఈ శుభ సమయంలో పూజ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు.
హిందూ మతంలో వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున గంగా దసరా పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి, సూర్యోదయానికి ముందే గంగాస్నానం చేసి తమ కోరికలు నెరవేరాలని గంగామాతను ప్రార్థిస్తారు. హిందూ మతంలో గంగా నదిని దేవతగా పూజిస్తారు. గ్రంధాలలో గంగాదేవిని మోక్షదాయిని అని కూడా అంటారు. గంగానదిలో స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు లభిస్తాయని విశ్వాసం.
పంచాంగం ప్రకారం వైశాఖ శుక్ల పక్ష దశమి తిథి జూన్ 16వ తేదీ తెల్లవారుజామున 02:32 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి జూన్ 17వ తేదీ తెల్లవారుజామున 04:40 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం జూన్ 16, 2024 ఆదివారం రోజున గంగా దసరా పండుగ జరుపుకోనున్నారు. గంగా దసరా రోజున ఉదయం 11.13 గంటల వరకు హస్తా నక్షత్రం ఉంది. ఆ తర్వాత చిత్రా నక్షత్రం ప్రారంభం అవుతుంది.
శుభ యోగాలు
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం గంగా దసరా రోజున అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రత్యేక రోజున సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి, ఇవి పూజకు ఉత్తమమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఈ శుభ సమయంలో పూజ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు.
గంగా దసరా పూజా విధానం
- గంగా దసరా రోజున తెల్లవారుజామున నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో గంగాస్నానం చేయాలి.
- ఇది సాధ్యం కాకపోతే.. ఇంటిలోనే నీటిలో గంగాజలం కలిపి స్నానం చేయవచ్చు.
- గంగా దసరా రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.
- గంగామాతను, శివుడిని నియమ నిష్టలతో పూర్తి ఆచారాలతో పూజ చేయండి.
- ఈ రోజున గంగా మూల పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
- గంగా దసరా రోజున పేదలకు, ఆపన్నులకు అవసరమైన వస్తువులను దానం చేయండి.
గంగా దసరా ప్రాముఖ్యత
హిందూ మత గ్రంధాలలో గంగా మాత మోక్ష ప్రదాతగా వర్ణించబడింది. అటువంటి పరిస్థితిలో గంగా దసరా రోజున పవిత్ర స్నానం చేయడం వల్ల వ్యాధులు, దోషాలు మొదలైన వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. పురాణ గ్రంథాల ప్రకారం గంగా నది శివుని జటాజూటం నుంచి ఉద్భవించింది. అటువంటి పరిస్థితిలో ఈ ప్రత్యేకమైన రోజున శివుడిని నియమ నిష్టలతో పూజించడం వలన విశేష ప్రయోజనాలను, ఆనందం, శ్రేయస్సును ఇస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున పూర్వీకులకు నైవేద్యాన్ని సమర్పించడం కూడా ప్రయోజనకరం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు