AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Safety Tips: చలికాలంలో పిల్లల సంరక్షణకు ఏడు అద్భుత చిట్కాలు..! తప్పకుండా తెలుసుకోండి..

సాధారణ జలుబు, ఫ్లూ కూడా వైద్యుని సహాయంతో మాత్రమే చికిత్స చేయాలి. డాక్టర్‌తో మాట్లాడకుండా పిల్లలకి మాత్రలు ఇవ్వకూడదు. మెడిసిన్‌ ఎక్కువగా వాడటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

Winter Safety Tips: చలికాలంలో పిల్లల సంరక్షణకు ఏడు అద్భుత చిట్కాలు..! తప్పకుండా తెలుసుకోండి..
Healthy Food For Kids
Jyothi Gadda
|

Updated on: Dec 20, 2022 | 7:37 PM

Share

చలికాలంలో చిన్న పిల్లలు జలుబు, దగ్గు, న్యుమోనియా, ఆస్తమా, శ్వాస సమస్యలు, జ్వరం, చెవి ఇన్ఫెక్షన్లు, కడుపు నొప్పులతో సహా అనేక వ్యాధులకు గురవుతారు. తల్లిదండ్రులు ఎన్ని సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నా పిల్లలకు ముక్కుకారడం తప్పడం లేదు. అలాగే, పిల్లలు డాక్టర్ చెప్పిన అన్ని మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అని చూడటం తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా ఉంటుంది. మీ బిడ్డను ఎలా చూసుకోవాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని తప్పక తెలుసుకోండి.

సాధారణ జలుబు, ఫ్లూ కూడా వైద్యుని సహాయంతో మాత్రమే చికిత్స చేయాలి. డాక్టర్‌తో మాట్లాడకుండా పిల్లలకి మాత్రలు ఇవ్వకూడదు. మెడిసిన్‌ ఎక్కువగా వాడటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

చల్లటి నీరు తాగడం మానేయాలి: పిల్లలు చలికాలంలో కూడా చల్లటి నీటినే తాగడానికి ఉపయోగిస్తారు. చల్లని నీరు తాగడం వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని వల్ల దగ్గు, జలుబు వచ్చే అవకాశం ఉంది. అందుకోసం పిల్లలకు వేడినీళ్లు ఇవ్వడం మంచిది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం వల్ల శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపుతుంది.

ఇవి కూడా చదవండి

వేయించిన ఆహారాన్ని తగ్గించండి: చాలా మంది పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, బర్గర్స్ వంటి జంక్ ఫుడ్స్ తింటారు. జంక్ ఫుడ్స్ మానేసి పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చేలా జాగ్రత్తపడాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చంcr. ప్రోటీన్, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పిల్లలలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

వ్యాయామం: పిల్లవాడు ఆడుకోవడానికి బయటికి వెళ్తాడు. వాడిని సూర్యకాంతిలో ఆడనివ్వండి. రెగ్యులర్ వ్యాయామం పిల్లల పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి