AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care: మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, ఆ లోపం ఉన్నట్లే.. జాగ్రత్త

అయోడిన్ శరీరానికి ప్రధానమైనది.. పోషకాలతో పాటు శరీరంలో లవణాలు.. (అయోడిన్) సరైన మొత్తంలో ఉండటం చాలా ముఖ్యం. కండరాలను పుష్టిగా మార్చడంతోపాటు బలోపేతం చేయడానికి అయోడిన్ అవసరం..

Health Care: మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, ఆ లోపం ఉన్నట్లే.. జాగ్రత్త
Health Tips
Shaik Madar Saheb
|

Updated on: Mar 25, 2023 | 9:57 AM

Share

అయోడిన్ శరీరానికి ప్రధానమైనది.. పోషకాలతో పాటు శరీరంలో లవణాలు.. (అయోడిన్) సరైన మొత్తంలో ఉండటం చాలా ముఖ్యం. కండరాలను పుష్టిగా మార్చడంతోపాటు బలోపేతం చేయడానికి అయోడిన్ అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు వస్తాయి. అయోడిన్ లోపం వల్ల ఎక్కువ నిద్ర.. అనేక రకాల వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంది. అదే సమయంలో, మన శరీరం అయోడిన్ లోపం కారణంగా అనేక రకాల సంకేతాలను ఇస్తుంది. వీటి ఆధారంగా అయోడిన్ లోపం ఉందని గ్రహించి చర్యలు తీసుకోవడం ఉత్తమం.. అయోడిన్ లోపం ఉన్నప్పుడు శరీరం ఎలాంటి సంకేతాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకోండి..

అయోడిన్ లోపం లక్షణాలు

మెడలో వాపు: అయోడిన్ లోపం కారణంగా మెడలో వాపు కనిపిస్తుంది. ఎందుకంటే శరీరంలో అయోడిన్ లోపం ఉన్నప్పుడు, థైరాయిడ్ శరీరంలో పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా మీ గొంతు ఉబ్బుతుంది. అందువల్ల, మీ మెడలో కూడా వాపు ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇది అయోడిన్ లోపం లక్షణం.

బరువు పెరగడం: అయోడిన్ లోపం వల్ల శరీర బరువు పెరగడం మొదలవుతుంది. ఎందుకంటే అయోడిన్ లోపం వల్ల శరీరంలో మెటబాలిజం తగ్గి బరువు పెరగడం మొదలవుతుంది. జీవక్రియ రేటు మందగించడానికి హార్మోన్ల అసమతుల్యత కూడా కారణం. ఈ విధంగా, మీ బరువు అకస్మాత్తుగా పెరగడం ప్రారంభమయితే.. దానిని విస్మరించవద్దు. ముందుగా అయోడిన్ పరీక్ష చేయించుకోని.. చర్యలు తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

ఆలోచనా శక్తి బలహీనమవుతుంది: అయోడిన్ లోపం వల్ల జ్ఞాపక శక్తి బలహీనపడుతుంది. మనిషికి ఏదీ గుర్తుండదు. అటువంటి పరిస్థితిలో, మీరు కూడా ఏమీ గుర్తుకు రావడం లేదని భావిస్తే దీనిపై దృష్టి పెట్టాలి.

చలి: అయోడిన్ లోపం వల్ల చల్లగా అనిపిస్తుంది. ఎందుకంటే అయోడిన్ తక్కువగా ఉన్నప్పుడు, జీవక్రియ శరీరంలో వేడి ఉత్పత్తి ప్రక్రియను తగ్గిస్తుంది. దీని కారణంగా ఒక వ్యక్తి అన్ని సమయాలలో చల్లగా ఉంటారు.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..