AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. కప్పులు కప్పులు లాగించేస్తున్నారా..? మిషన్ కాఫీ ఎంత డేంజరో తెలుసా..

ఆఫీసులో కాఫీ మెషీన్ చూసిన తర్వాత మీరు కూడా మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోతున్నారా? రోజుకు మూడు నుంచి నాలుగు కప్పుల కాఫీని లాగించేస్తున్నారా..? అయితే.. మీరు ప్రమాదంలో పడినట్లే.. మీరు డైలీ ఇలా చేస్తే, అది మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. యంత్రాలతో తయారు చేసిన కాఫీ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి కొన్ని షాకింగ్ నిజాలను కొత్త పరిశోధన వెల్లడించింది. అవేంటో తెలుసుకోండి..

వామ్మో.. కప్పులు కప్పులు లాగించేస్తున్నారా..? మిషన్ కాఫీ ఎంత డేంజరో తెలుసా..
Coffee Making Machine
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 12, 2025 | 4:08 PM

ఉద్యోగాలకు వెళ్లే వారు.. జర్నీ చేసేవారు.. సమయం లేనివారు.. ఇలా చాలామంది రోజును మిషన్ కాఫీతో రోజును ప్రారంభిస్తారు.. ఉద్యోగులైతే.. మెషిన్ కాఫీతోనే రోజు మొత్తం గడపాల్సి ఉంటుంది. ఉదయం సమావేశానికి ముందు అయినా.. లేదా మధ్యాహ్నం అయినా, చాలా మంది ఆఫీసులోని మిషిన్ నుంచి కాఫీ తాగుతారు.. కానీ అది మీ ఆరోగ్యానికి తీవ్రమైన, ప్రాణాంతకమైన నష్టాన్ని కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక కొత్త పరిశోధన ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ కాఫీ మీ ఆరోగ్యానికి, ముఖ్యంగా మీ గుండెకు హానికరం కావచ్చు. అటువంటి పరిస్థితిలో, ఆఫీసులోని యంత్రాల నుంచి కాఫీ తాగడం వల్ల కలిగే హాని గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను తెలుసుకోండి..

పరిశోధనలో ఏం చెప్పారంటే..

పరిశోధకులు నాలుగు వేర్వేరు కార్యాలయాల నుండి 14 కాఫీ యంత్రాల నుంచి నమూనాలను తీసుకొని వాటిని విశ్లేషించారు. ఈ యంత్రాలలో మూడు రకాల సాంకేతికతలను ఉపయోగించారు. కొన్నింటిలో మెటల్ ఫిల్టర్ ఉంటుంది.. కొన్నింటిలో లిక్విడ్ కాఫీ కాన్సంట్రేట్ ఉపయోగించబడుతుంది.. మరికొన్ని ఇన్‌స్టంట్ ఫ్రీజ్-డ్రైడ్ కాఫీని ఉపయోగిస్తాయి. వీటన్నింటినీ ఇంట్లో తయారుచేసిన పేపర్ ఫిల్టర్ కాఫీతో పోల్చినప్పుడు, ఆఫీస్ మిషిన్ కాఫీ ఆరోగ్య పరంగా వెనుకబడి ఉందని పరిశోధకులు వెల్లడించారు.

కాఫీ చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది..

స్వీడన్‌లో నిర్వహించిన ఈ అధ్యయనం న్యూట్రిషన్, మెటబాలిజం, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనే జర్నల్‌లో ప్రచురించారు. కాఫీ మిషిన్ నుంచి పొందిన కాఫీలో శరీరంలో ‘చెడు’ కొలెస్ట్రాల్ అంటే LDL ను పెంచే కొన్ని అంశాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఈ మూలకాల పేర్లు కేఫెస్టోల్ – కహ్వీల్. ఈ పేర్లు వినడానికి వింతగా అనిపించవచ్చు.. కానీ అవి గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.

వారానికి మూడు సార్లు ఆఫీస్ కాఫీకి బదులుగా పేపర్ ఫిల్టర్ కాఫీ తాగితే, వారి LDL కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయని పరిశోధనలో తేలింది. దీని అర్థం మీరు చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా మీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు.

కార్యాలయ ఉద్యోగులు – మిషిన్ కాపీ తాగేవారు ఏం చేయాలి?

ఈ అధ్యయనం ఫలితాల నుంచి కార్యాలయ నిర్వహణ కూడా నేర్చుకోవాలి. దీనిద్వారా.. బహుశా ఆఫీసులోకి మెరుగైన ఫిల్టర్ కాఫీ యంత్రాలను ప్రవేశపెట్టే సమయం ఆసన్నమైంది లేదా ఉద్యోగులు ఇంటి నుండే ఫిల్టర్ చేసిన కాఫీని తీసుకురావాలని ప్రోత్సహించే సమయం ఆసన్నమైందని అర్ధం చేసుకోవాలని పరిశోధకులు వెల్లడించారు. కాఫీని వదులుకోవాల్సిన అవసరం లేదు.. కానీ దానిని తీసుకునే విధానాన్ని మెరుగుపరచడం చాలా ముఖ్యం అని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు.

వైద్య నిపుణులు ఏమంటున్నారు?..

సమతుల్య పరిమాణంలో కాఫీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్, అల్జీమర్స్, కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు ఇంట్లో తయారుచేసిన కాఫీ తాగవచ్చు లేదా దుకాణంలో తయారుచేసిన కాఫీని కొనవచ్చు. మిషిన్ కాఫీకి దూరంగా ఉండటం ద్వారా మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..