Covid 19: ప్రసవానికి ముందు.. తర్వాత తల్లి నుంచి బిడ్డకు కోవిడ్ సోకే ప్రమాదం ఉందా..? అధ్యయనంలో సరికొత్త విషయాలు
Covid 19: కరోనా వైరస్ ( Sars-Cov-2 ) వల్ల ప్రభావం గురించి కోవిడ్-19 వ్యాధిపై ఒక అధ్యయనం నిర్వహించారు పరిశోధకులు. ప్రసవానికి ముందు లేదా తర్వాత శిశువుకు తల్లి..
Covid 19: కరోనా వైరస్ ( Sars-Cov-2 ) వల్ల ప్రభావం గురించి కోవిడ్-19 వ్యాధిపై ఒక అధ్యయనం నిర్వహించారు పరిశోధకులు. ప్రసవానికి ముందు లేదా తర్వాత శిశువుకు తల్లి నుండి ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉందని తేలింది అధ్యయనం ద్వారా తేల్చారు. BMJలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కోవిడ్ సోకిన తల్లులకు పుట్టిన పిల్లల సంఖ్య రెండు శాతంగా పరిశోధకులు గుర్తించారు. అయినప్పటికీ తల్లి కోవిడ్-19 తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కు గురైనా.. లేదా ప్రసవించిన తర్వాత వ్యాధి సోకితే బిడ్డకు కరోనా వైరస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
యూకేలోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల నేతృత్వంలోని బృందం సాధారణ వైద్య విధానాలలో జన్మించిన, తల్లిపాలు తాగే శిశువులకు వారి తల్లుల ద్వారా కూడా సోకే అవకాశం తక్కువగా ఉందని కనుగొన్నారు. పరిశోధకులు ప్రపంచం నలుమూలల నుండి డేటాను సేకరించారు. కరోనావైరస్ సోకిన తల్లులకు జన్మించిన 14,000 మందికి పైగా శిశువులను పర్యవేక్షించారు.
తల్లి నుండి 1.8% పిల్లలకు మాత్రమే కరోనా ఇన్ఫెక్షన్:
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. అధ్యయనంలో చేర్చబడిన 14,271 మంది పిల్లలలో 1.8 శాతం మంది మాత్రమే SARS-Cov-2 బారిన పడినట్లు గుర్తించారు. గర్భిణీ స్త్రీలలో ఇన్ఫెక్షన్, తీవ్రమైన అనారోగ్యాన్ని నివారించడానికి గర్భధారణ సమయంలో టీకాలు వేయడాన్ని మరింత ప్రోత్సహించాలని పరిశోధకులు తెలిపారు.
తల్లి పాలివ్వడంలో ప్రమాదం లేదు:
గత సంవత్సరం వరకు కోవిడ్ సోకిన తల్లికి తల్లి పాలివ్వడం వల్ల పిల్లలకు ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని, తల్లి నుండి బిడ్డకు కరోనా సంక్రమణకు సంబంధించి మరొక సందేహం ఉంది. అయితే దీనిపై చేసిన పరిశోధన అధ్యయనంలో కూడా ఈ అవకాశం తిరస్కరించబడింది. ‘పీడియాట్రిక్ రీసెర్చ్’లో ప్రచురించబడిన ఒక పరిశోధనా అధ్యయనం ప్రకారం.. కోవిడ్ సోకిన తల్లి.. బిడ్డకు పాలివ్వడం ద్వారా బిడ్డకు వైరస్ సంక్రమించే అవకాశం లేదు. ఇందులో స్త్రీ పాలలో చాలా తక్కువ భాగం కోవిడ్-19కి సంబంధించిన జన్యు పదార్ధాలను కలిగి ఉన్నప్పటికీ, నవజాత శిశువులలో SARS-Cov-2 క్లినికల్ ఇన్‌ఫెక్షన్‌కు ఇది రుజువు కాదని పరిశోధకులు కనుగొన్నారు.
ఈ నిర్ణయానికి రావడానికి USAలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు 110 మంది పాలిచ్చే మహిళల నుండి పాల నమూనాలను విశ్లేషించారు. ఈ మహిళలు మార్చి, సెప్టెంబర్ 2020 మధ్య యూనివర్సిటీ మమ్మీస్ మిల్క్ హ్యూమన్ మిల్క్ బయోరెపోజిటరీకి తమ పాలను విరాళంగా ఇచ్చారు. 110 మంది మహిళల్లో, 65 మంది కోవిడ్ -19 పరీక్షలో పాజిటివ్‌గా తేలింది, అయితే 9 మంది మహిళలకు కరోనా లక్షణాలు ఉన్నాయి. అయితే వారు పరీక్షలో నెగిటివ్‌గా వచ్చారు. పరిశోధకుడు పాల్ క్రోగ్‌స్టాడ్, ఇతర సహచరులు తమ పాలలో వైరస్ జన్యు పదార్ధం (RNA) కనుగొనబడిన ఏడుగురు మహిళలకు కరోనా సోకినట్లు లేదా లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించబడ్డాయి.
ఇవి కూడా చదవండి: