Ragi Java: రాగిజావతో అద్భుతమైన ఉపయోగాలు.. రాగుల్లో ఉండే ప్రోటీన్స్ ఏమిటి..?
Ragi Java: ఎండా కాలం రాబోతోంది. భారీ ఎండల కారణంగా వడదెబ్బ బారిన పడుతుంటారు. బయటకు వెళ్లాలంటేనే జనాలు జంకుతుంటారు..
Ragi Java: ఎండా కాలం రాబోతోంది. భారీ ఎండల కారణంగా వడదెబ్బ బారిన పడుతుంటారు. బయటకు వెళ్లాలంటేనే జనాలు జంకుతుంటారు. తీవ్రమైన ఎండలతో సొమ్మసిల్లిపడిపోతారు. అయితే ఎండాకాలంలో బయటకు వెళ్లాలంటే తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే వడదెబ్బ బారిన పడి మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో నీటి శాతం తగ్గడంతో పాటు శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే శరీరంలో చలువని పెంచేందుకు మన పూర్వీకులు జావను తయారు చేసుకుని తాగేవారు. మొదట్లో జావాల వాడకం తక్కువగా ఉన్నా.. ఈ మధ్య కాలంలో వీటి ప్రాధాన్యత పెరిగింది. జావాలు చేసే ఉపయోగాలు తెలిసినప్పటి నుంచి వీటి వాడకం ఎక్కువైపోయింది. అయితే జావను ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఎండాకాలంలో ఎక్కువగా రాగిజావ తాగుతుంటారు. ఈ రాగిజావ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.
ఉపయోగాలు..
రాగుల్లో పుష్కలంగా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రోటీన్లు, విటమిన్లు, ఏ,బీ,సీ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రాగుల్లో మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మిగిలిన ధాన్యాల్లో కంటే ఇందులో కాల్షియం 5-30శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫాస్ఫరస్, పోటాషియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాల్షియం సప్లిమెంట్ తీసుకునే బదులు రాగులు తినడం మంచిది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. అందుకే వయసు పెరిగిన వారు.. చిన్నపిల్లలు వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి.
రాగుల పై పొరలో మిగిలిన ధాన్యాలకంటే ఎక్కువ పాలిఫినాల్స్ ఉంటాయి. రాగులు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా హైపోగ్లెసీమిక్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో గాయం తొందరగా తగ్గడానికి కూడా ఇవి ఎంతగానో సహకరిస్తాయి. అందుకే వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి: