Brain Fag: జ్ఞాపకశక్తిపై కరోనా ప్రభావం.. ఆ సమస్య వేధిస్తోందా? ఇలా బయటపడొచ్చంటోన్న నిపుణులు..

Pandemic Made Memory Slow: యూకేలోని కెంట్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ సీనియర్ లెక్చరర్ అమీర్ హుమాయున్ జవాడి CNNతో మాట్లాడుతూ, మానవులు పరిస్థితులకు అనుగుణంగా అలవాటు పడుతున్నారని అన్నారు.

Brain Fag: జ్ఞాపకశక్తిపై కరోనా ప్రభావం.. ఆ సమస్య వేధిస్తోందా? ఇలా బయటపడొచ్చంటోన్న నిపుణులు..
Brain
Follow us
Venkata Chari

|

Updated on: Feb 04, 2022 | 10:59 AM

Pandemic Made Memory Loss: మీరు కొంతకాలంగా తేదీలు, నంబర్లు, రోజువారీ పనులను గుర్తుంచుకోవడంలో సమస్య ఎదుర్కొంటున్నారా? మీ సమాధానం అవును అయితే ఇది ఓసారి తెలుసుకోవడం మంచింది. ఇది మీ ఒక్కరి సమస్యే కాదు.. ఇలా చాలామంది పోరాడుతున్నారు. కారణం ఏంటంటే.. గత రెండేళ్లలో, కరోనా(Coronavirus) మహమ్మారి మనందరి జ్ఞాపకశక్తిని(Memory) బలహీనపరిచింది. దీని వల్ల ఫోకస్ చేయలేకపోవడం, ముఖ్యమైన సమాచారాన్ని మర్చిపోవడం అనే సమస్య ప్రజల్లో పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూకే(UK)లోని కెంట్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ సీనియర్ లెక్చరర్ అమీర్ హుమాయున్ జవాడి CNNతో మాట్లాడుతూ, మానవులు పరిస్థితులకు అనుగుణంగా అలవాటు పడతారని అన్నారు. గత రెండేళ్లుగా ప్రజలు జీవితంలో పెద్దగా ప్రణాళికలు వేసుకోకపోవడంతో ఈ సమస్యతో బాధపడుతున్నారు. ప్రజలు ఇలాంటి జీవితాన్ని గడపడం నేర్చుకున్నారు. ఇది వారి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది’ అని ఆయన తెలిపారు.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని న్యూరోబయాలజీ ప్రొఫెసర్ మైఖేల్ యాస్సా మాట్లాడుతూ, జ్ఞాపకశక్తి అంటే కేవలం ఫోటో తీయడం, గుర్తుంచుకోవడం కాదు. ఒక క్షణం జీవించడం ద్వారా జ్ఞాపకశక్తి ఏర్పడుతుంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు జ్ఞాపకాలను నెమరువేసుకోవడం చాలా కష్టంగా మారింది. జీవితంలో ప్రత్యేకంగా గుర్తుండిపోయేది ఏమీ లేదు. అందుకే ఏమీ గుర్తుపెట్టుకోకుండా అలవాటు పడ్డారు’ అని తెలిపారు.

కరోనా ఇన్ఫెక్షన్ లేకపోయినా మెదడులో ఇలాంటి లక్షణాలు.. క‌రోనా ఇన్ఫెక్షన్ రాని వారిలో రోజూ ఒకేలా ఉండ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల బ్రెయిన్ ఫాగ్‌ ఏర్పడిందని అమీర్ పేర్కొన్నారు. బ్రెయిన్ ఫాగ్ అనేది ఒక వ్యక్తి ప్రవర్తనలో వేగవంతమైన మార్పులకు కారణమయ్యే పరిస్థితి. అలాంటి వారికి ఎప్పుడూ అలసట, చిరాకు, డిప్రెషన్, తలనొప్పి, ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, నిద్రలేమి, చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం వంటి సమస్యలు ఉంటాయి.

జ్ఞాపకశక్తిని ఎలా కాపాడుకోవాలి? వైరస్ లేదా మహమ్మారి ఆందోళన కారణంగా జ్ఞాపకశక్తి కోల్పోయినా, మన జీవనశైలిని మార్చుకోవడంతో మన మెదడు పనితీరును సరిచేసుకోవచ్చు. దీంతో జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవచ్చు. ఈ 6 చిట్కాలను పాటించి జ్ఞాపకశక్తిని ఎలా పెంచుకోవచ్చొ తెలుసుకుందాం. 1. సమయానికి నిద్రపోవాలి 2. రోజూ కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయాలి 3. పోషకాహారం తినాలి 4. వ్యక్తులతో సంభాషించాలి 5. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.

ధ్యానం సహాయంతో ఒత్తిడిని జయించొచ్చు.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మనసును ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మెదడుకు ఎంత వ్యాయామం అందిస్తే, జ్ఞాపకశక్తి అంత బలంగా ఉంటుంది. అలాగే, బ్రెయిన్ ఫాగ్ అనుభవిస్తే మాత్రం మద్యం సేవించడం మానుకోండి.

Also Read: Astronaut lifestyle in Space: అంతరిక్షంలో వ్యోమగాములు ఏం తింటారో, ఎలా జీవిస్తారో తెలుసా? అక్కడికి ఫుడ్ డెలివరీలు కూడా..

Health: పక్షవాతం బారిన పడకూడదనుకుంటే ఈ పని చేయాల్సిందే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే