Health: పక్షవాతం బారిన పడకూడదనుకుంటే ఈ పని చేయాల్సిందే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే.
Health: మారుతోన్న జీవనశైలి, తీసుకునే ఆహారం కారణం ఏదైనా ఇటీవల రోగాల బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈ సాంకేతిక యుగంలో కాలు తీసి బయట పెట్టే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది...
Health: మారుతోన్న జీవనశైలి, తీసుకునే ఆహారం కారణం ఏదైనా ఇటీవల రోగాల బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈ సాంకేతిక యుగంలో కాలు తీసి బయట పెట్టే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. నాలుగు అడుగులు వేయాలన్నా బైక్ తీసే పరిస్థితులు వచ్చాయి. ప్రతీ వస్తువు ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇంటికే వస్తుండడంతో కనీసం షాపింగ్ కోసం బయటకు వెళ్లే వారు కూడా తగ్గిపోతున్నారు. తీసుకున్న ఆహారానికి తగ్గ శారీరకశ్రమ లేకపోవడం దాదాపు ఉద్యోగాలన్నీ కూర్చొని చేసే కావడంతో అనారోగ్యం బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.
ఇలా వేధిస్తోన్న సమస్యల్లో పక్షవాతం ఒకటి. యంగ్ ఏంజ్‌లో ఉన్నప్పుడు సరైన శారీరక శ్రమ లేకపోవడంతో వయసు పెరిగిన తర్వాత ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి. అయితే భవిష్యత్తులో పక్షవాతం బారిన పడకూడదంటే వెంటనే నడక ప్రారంభించాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కెనడాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాల్గేనీ పరిశోధకులు పలువురిపై రీసర్చ్ చేసిన తర్వాత ఈ విషయాలను వెల్లడించారు. రోజులో కనీసం ముప్పై నిమిషాలు నడవడం వల్ల పక్షవాత ప్రమాదం సగానికి సగం తగ్గుతుందని వీరి పరిశోధనల్లో తేలింది.
ఇక 54 శాతం మంది పక్షపాత రోగుల్లో నడక ప్రాణాపాయాన్నీ నివారిస్తుందంటా. అలాగే వారానికి కనీసం మూడు గంటలు నడిచే మహిళల్లో 43 శాతం మంది పక్షవాత ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడతారని పరిశోధనల్లో వెల్లడైంది. చూశారుగా నడక ఎంత మేలు చేస్తుందో. మరెందుకు ఆలస్యం వెంటనే బైక్‌లను పక్కన పట్టి నడక ప్రారంభించండి.
Also Read: VK Sasikala: చిక్కుల్లో చిన్నమ్మ.. జైల్లో సదుపాయాల కోసం ముడుపులు ఇచ్చారంటూ కేసు నమోదు..
MS Dhoni: తమ ఎదుగుదలపై ఎంఎస్ ధోనీ ప్రభావం.. మరోసారి తేల్చిన చెప్పిన స్పిన్నర్లు.
Inspiring story: మట్టిలో మాణిక్యం ఈ అంజనమ్మ.. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మేకల కాపరి కూతురు..