AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VK Sasikala: చిక్కుల్లో చిన్నమ్మ.. జైల్లో సదుపాయాల కోసం ముడుపులు ఇచ్చారంటూ కేసు నమోదు..

VK Sasikala: శశికళ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. జయలలిత (Jayalalita) నెచ్చెలికి మరో షాక్‌ తగిలింది. లేటెస్ట్‌గా మరో కేసులో ఇరుక్కున్నారు శశికళ. తాజాగా శశికళపై మరో కేసు నమోదైంది. అక్రమాస్తుల..

VK Sasikala: చిక్కుల్లో చిన్నమ్మ.. జైల్లో సదుపాయాల కోసం ముడుపులు ఇచ్చారంటూ కేసు నమోదు..
Vk Sashikala
Surya Kala
|

Updated on: Feb 03, 2022 | 8:00 PM

Share

VK Sasikala: శశికళ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. జయలలిత (Jayalalita) నెచ్చెలికి మరో షాక్‌ తగిలింది. లేటెస్ట్‌గా మరో కేసులో ఇరుక్కున్నారు శశికళ. తాజాగా శశికళపై మరో కేసు నమోదైంది. అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న సమయంలో సకల సదుపాయాల కోసం ఆమె ముడుపులు ఇచ్చినట్లు బెంగళూరు(Bengaluru) ఏసీబీ ఛార్జ్​షీట్​ దాఖలు చేసింది. జైలు అధికారులపై కూడా అభియోగాలు మోపింది. అధికారులకు ముడుపులు ఇచ్చినట్లుగా.. జైలు సిబ్బంది పేర్లను కూడా ఇందులో జత చేసింది.

ఓ అవినీతి కేసులో శిశకళ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవించారు. ఆ సమయంలో జైల్లో తాము అడిగిన సదుపాయాలు కల్పించేందుకు సిబ్బందికి ముడుపులు ఇచ్చినట్లు బెంగళూరు ఏసీబీ ఛార్జ్​షీట్​లో పేర్కొంది. ఇళవరసి నుంచి సిబ్బంది ఈ మొత్తాన్ని అందుకున్నట్లు తెలిపింది. ఆమె పేరును కూడా చార్జ్‌షీట్‌లో చేర్చింది.

ఈ వ్యవహారానికి సంబంధించి సీనియర్ పోలీసు అధికారి, ఆయన సిబ్బందిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే అనుమతి ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో 2017లో జైలుకు వెళ్లారు శశికళ, ఇళవరసి. 2021లో విడుదలయ్యారు.

మరోవైపు.. శశికళతో ప్రముఖ నటి, బీజేపీ నేత విజయశాంతి భేటీ అయ్యారు. తమిళనాడు తాజా రాజకీయాలపై వీరిరువూ చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలోకి శశికళ ఎంట్రీపై సానుకూలత వ్యక్తమవుతోంది. పన్నీర్‌ సెల్వం శశికళ రాకను స్వాగతిస్తున్నారు. మాజీ సీఎం పళని వర్గం మాత్రం శశికళను గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో శశికళతో విజయశాంతి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read:

MLA Balakrishna: జిల్లా కేంద్రం ఏర్పాటు కోసం రేపు హిందూపురంలో బాలకృష్ణ మౌన దీక్ష.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటన..