Natural Food for Platelets: మీరు తినే పదార్ధాల్లో ఈ తొమ్మిది ఆహారాలని చేర్చుకోండి.. సహజంగా ప్లేట్ లెట్స్ ను పెంచుకోండి

Natural Food for Platelets: రోజు రోజుకీ డెంగ్యూ ఫీవర్ బాధితుల సంఖ్య అధికమవుతుంది. ఈ వ్యాధిబారిన పడివారు ఎక్కువగా రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గి..

Natural Food for Platelets: మీరు తినే పదార్ధాల్లో ఈ తొమ్మిది ఆహారాలని చేర్చుకోండి.. సహజంగా ప్లేట్ లెట్స్ ను పెంచుకోండి
Platelet Count
Follow us
Surya Kala

|

Updated on: Oct 04, 2021 | 5:01 PM

Natural Food for Platelets: రోజు రోజుకీ డెంగ్యూ ఫీవర్ బాధితుల సంఖ్య అధికమవుతుంది. ఈ వ్యాధిబారిన పడివారు ఎక్కువగా రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనశరీరంలో ఈ ప్లేట్ లెట్స్ జీవితకాలం.. 5 నుంచి 9 రోజులు.  అతి చిన్న కణాలు.. రక్తం గడ్డ కట్టడానికి రక్త స్రావాన్ని ఆపడానికి సహాయపడతాయి.ఈ ప్లేట్ లెట్స్ తగ్గితే.. ప్రాణాపాయ స్థితి కూడా చేరుకుంటారు.. కనుక డెంగ్యూ వ్యాధి నిర్ధారణ కాగానే సహజంగా ప్లేట్ లెట్స్ పెంచుకునే విధంగా ఆహారాన్ని తీసుకుంటే.. ఈ వ్యాధి నుంచి త్వరగా బయటపడవచ్చు. ఈరోజు రక్తంలో ప్లేట్లెట్స్ ను అభివృద్ధి చేసే తొమ్మిది ఉత్తమ ఆహారాల గురించి తెలుసుకుందాం..

బొప్పాయి: బ్లడ్ లెవల్ తక్కువగా  ఉన్న వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది. బొప్పాయిలో మంచి ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గినప్పుడు వాటి సంఖ్యను పెంచుకోవడానికి బొప్పాయి, వాటి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. కొంచెం కష్టమైనా ఇష్టంగా బొప్పాయి ఆకు రసాన్ని తాగితే.. మంచిది.

బీట్ రూట్ : ప్లేట్ లెట్స్ ను పెంచడంలో మంచి సహాయకారి ఈ దుంప. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వారు  తప్పనిసరిగా తినే ఆహారంలో బీట్ రూట్ ను చేర్చుకోవాలి.

క్యారెట్ : క్యారెట్ కూడా ప్లేట్ లెట్స్ పెంచడంలో సహాయపడుతోంది. కనుక ఈ సీజన్ లో క్యారెట్ ను వారంలో కనీసం రెండు సార్లైనా తినమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఆకుకూరలు : శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు..  విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది. ఆకుకూరలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

వెల్లుల్లి : వెల్లుల్లి  ఐడియల్ పదార్ధాల్లో  ఒకటి. సహజంగా ప్లేట్ట్ లెట్స్ అభివృద్ధి చేసే గుణం వెల్లుల్లి సొంతం. కనుక తినే ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోమని సూచిస్తున్నారు.

 దానిమ్మ :  ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి దానిమ్మ పండు మంచి సహాయకారి.. బొప్పాయి తో పాటు దానిమ్మని కూడా డెంగ్యూ బాధితులు తీసుకుంటే వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు.

ఖర్జూరం : ఖర్జురం ఎలా తిన్నాఆరోగ్యానికి మంచిది. అయితే ఎండు ఖర్జూరంలో  ఐరన్ తో పాటు పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అంతేకాదు.. ఎండు ఖర్జురంలో ప్లేట్లెట్స్ మెరుగుపరిచే గుణాలు అధికంగా ఉన్నాయి.

ఆప్రికాట్ : ఐరన్ అధికంగా ఉన్నపండ్లలో మరొకటి ఆప్రికాట్..  రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.

ఎండు ద్రాక్ష : దీనిలో 30శాతం ఐరన్ ఉంటుంది. రోజూ గుప్పెడు ఎండు ద్రాక్షతింటే సహజంగా ప్లేట్లెట్ లెవల్స్ ను పెరుగుతాయి.

Also Read: చేనేత రంగంలో జాతీయ అవార్డు విన్నర్స్ ను సన్మానించిన మంత్రి కేటీఆర్..చేనేత సంక్షేమం కొరకు పనిచేస్తామని భరోసా