Minister KTR: చేనేత రంగంలో జాతీయ అవార్డు విన్నర్స్ ను సన్మానించిన మంత్రి కేటీఆర్..చేనేత సంక్షేమం కొరకు పనిచేస్తామని భరోసా

Minister KTR: చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన భారత ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్..

Minister KTR: చేనేత రంగంలో జాతీయ అవార్డు విన్నర్స్ ను సన్మానించిన మంత్రి కేటీఆర్..చేనేత సంక్షేమం కొరకు పనిచేస్తామని భరోసా
Ktr
Follow us
Surya Kala

|

Updated on: Oct 04, 2021 | 4:39 PM

Minister KTR: చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన భారత ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్ లతో పాటు మెరిట్ సర్టిఫికెట్ విజేతలు సాయిని భారత్, దుద్యాల శంకర్, తడక రమేష్ ను చేనేత మంత్రి కేటీఆర్ అసెంబ్లీ లోని తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ తమ వృత్తి నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరుప్రఖ్యాతి తెచ్చిన అవార్డు గ్రహితులకు శుభాకాంక్షలు తెలిపారు.

దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ రాష్ట్రం సొంతమని అన్నారు. చేనేత కళాకారులకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చేనేత పథకాల వలన చేనేత రంగం అభివృద్ధి చెందుతుందని, చేనేత కళాకారుల సంక్షేమం కొరకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్. రమణ, టి.ఆర్.ఎస్ అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత తదితరులు పాల్గొన్నారు.

Also Read: Mahabharat Moral Story: పాప, పుణ్యాలు అంటే ఏమిటి..? వీటిని మానవుడు ఎలా అనుభవిస్తాడో తెలుసా..