Virat Kohli: వారిలో ఎవరైనా ఆర్సీబీ కెప్టెన్ కావొచ్చు..? చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
విరాట్ కోహ్లీ 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి నాయకత్వం వహించనని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. కోహ్లీ నాయకుడిగా తప్పుకుంటే అతని స్థానంలో ఎవరు..
విరాట్ కోహ్లీ 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి నాయకత్వం వహించనని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. కోహ్లీ నాయకుడిగా తప్పుకుంటే అతని స్థానంలో ఎవరు బాధ్యత తీసుకుంటారని ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ఆర్సీబీకి కెప్టెన్సీ నియామకంపై చాలా ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా మాజీ భారత క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. కోహ్లీ నుంచి బాధ్యతలు తీసుకునే అవకాశమున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించారు. జాబితాలో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో తెలిపారు.
“శ్రేయస్ అయ్యర్‌ని ఢిల్లీ వదిలివేస్తుందా? అతను కెప్టెన్సీ మెటీరియల్ కావచ్చు. కేఎల్ రాహుల్ పంజాబ్‌లో కొనసాగుతారా? అతను బయటకు వస్తే, అతడే కావచ్చు. మయాంక్ అగర్వాల్ విడుదలైతే, అతను కావచ్చు. రవిచంద్రన్ అశ్విన్ విడుదలైతే, అతను కావచ్చని” తెలిపారు. మెగా వేలానికి ముందు ఏబీ డివిలియర్స్, కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్ యుజ్వేంద్ర చాహల్‌లను అర్సీబీ నిలుపుకుంటుందని చోప్రా అంచనా వేశారు. వీరందరు ఉన్నప్పటికీ కొత్త కెప్టెన్ ఎవరు? అనేది ఆసక్తికరంగా ఉంటుందన్నారు. డేవిడ్ వార్నర్ మరొక అభ్యర్థి అని పుకార్లు వస్తున్నందన.. తదుపరి ఆర్సీబీ కెప్టెన్ ఎవరు అనేది ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ఆర్సీబీ పంజాబ్‌పై విజయంతో, ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇంకా ఒక గేమ్ మిగిలి ఉన్నందున, వారు దానిని గెలవాలని కోరుకుంటున్నారని చెప్పారు.