IPL 2021 DC vs CSK Highlights: చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం.. రాణించిన శిఖర్ ధావన్‌..

Narender Vaitla

| Edited By: uppula Raju

Updated on: Oct 04, 2021 | 11:27 PM

Delhi Capitals vs Chennai Super Kings Highlights: ఐపీఎల్‌ 2021లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. పాయింట్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్న..

IPL 2021 DC vs CSK Highlights:  చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం.. రాణించిన శిఖర్ ధావన్‌..

Delhi Capitals vs Chennai Super Kings Live Updates: ఐపీఎల్‌ 2021లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. పాయింట్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్‌కు దుబాయ్‌ వేదికకానుంది. అగ్రస్థానం కోసం దుబయ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడనున్నాయి. దీంతో క్రికెట్‌ అభిమానులు ఈ మ్యాచ్‌పై వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ రెండు జట్లు ప్లేఆఫ్‌లో తమ స్థానాలను నిర్ధారించుకున్నాయి. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ నిలచింది. ప్రస్తుతం రెండు జట్లు టోర్నమెంట్‌లో టాప్ 2 లో ఉన్నాయి. 12 మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లకు చెరో 18 పాయింట్లతో నిలిచాయి. అయితే రన్ రేట్ ఆధారంగా ధోని సేన మొదటి స్థానంలో నిలిచింది. రిషబ్ పంత్ ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది. మరి ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచేదరో చూడండి..

దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదటగా టాస్‌ గెలిచి ఢిల్లీ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగిన చెన్నై 20 ఓవర్లలో 136 పరుగులు చేసింది. అంబటి రాయుడు చివరి వరకు క్రీజులో నిలవడంతో చెన్నై కనీసం ఈ స్కోరైనా చేసింది. రాయుడు 43 బంతుల్లో 55 పరుగులు (2 సిక్సర్లు, 5 ఫోర్లు) చేశాడు. రాబిన్ ఊతప్ప19 పరుగులు, ధోనీ 18 పరుగులు మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. ఢిల్లీ బౌలర్లలో అక్సర్ పటేల్‌ 2 వికెట్లు సాధించాడు.

137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఫృధ్వీషా, శిఖర్ ధావన్‌ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. ఫృధ్వీషా 18 పరుగులు చేసి ఔటైనా శిఖర్ ధావన్ నిలకడగా ఆడి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 39 పరుగులు (2 సిక్స్‌లు, 3 ఫోర్లు) చేసి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే చివరలో చెన్నై బౌలర్లు చెలరేగిపోయారు. వరుసగా వికెట్లు సాధించారు. దీంతో ఢిల్లీ ఓడిపోతుందని అనుకున్నారు. కానీ క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెమ్మీర్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 2 వికెట్లు, శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు సాధించారు.

జట్టు సభ్యులు..

CSK: MS ధోని (క్యాప్ట్-వికెట్‌ కీపర్‌), రితురాజ్ గైక్వాడ్, ఫాఫ్‌డు ప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

DC: రిషబ్ పంత్ (క్యాప్ట్-వికె), పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, షిమ్రాన్ హెట్మయర్, రిప్పల్ పటేల్, అక్సర్ పటేల్, ఆర్. అశ్విన్, కగిసో రబాడా, అవేష్ ఖాన్, ఎన్రిక్ నార్ఖియా

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 04 Oct 2021 11:08 PM (IST)

    చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం..

    నువ్వా, నేనా అనే తరహాలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ విజయం సాధించింది. చివరలో షిమ్రాన్ హెమ్మీర్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకు ముందు శిఖర్ ధావన్ 39 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ పాయింట్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

  • 04 Oct 2021 10:44 PM (IST)

    16 ఓవర్లకు ఢిల్లీ 104 /6

    ఢిల్లీ క్యాపిటల్స్‌ 16 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. క్రీజులో షిమ్రాన్ హెమ్మీర్ 6 పరుగులు, అక్సర్‌ పటేల్ 1 పరుగుతో ఆడుతున్నారు. చెన్నై బౌలర్లలో శార్దుల్‌ ఠాగూర్‌కి 2 వికెట్లు దక్కాయి. విజయానికి ఢిల్లీ ఇంకా 22 బంతుల్లో 31 పరుగులు చేయాల్సి ఉంది.

  • 04 Oct 2021 10:28 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ

    ఢిల్లీ క్యాపిటల్స్‌ నాలుగో వికెట్‌ని కోల్పోయింది. రిపాల్ పటేల్‌ 18 పరుగులు ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 13.5 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. ఇంకా ఢిల్లీ 36 బంతుల్లో 39 పరుగులు చేయాలి.

  • 04 Oct 2021 10:15 PM (IST)

    10 ఓవర్లకు ఢిల్లీ స్కోరు.. 75/3

    ఢిల్లీ క్యాపిటల్స్‌ 10 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్‌ ధావన్‌ 33 పరుగులు, రిపాల్ పటేల్‌ 3 పరుగులతో ఆడుతున్నారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజాకి 1 వికెట్‌ దక్కింది. విజయానికి ఢిల్లీ ఇంకా 59 బంతుల్లో 58 పరుగులు చేయాల్సి ఉంది.

  • 04 Oct 2021 10:09 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ

    ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడో వికెట్‌ని కోల్పోయింది. రిషబ్‌ పంత్ 15 ఔటయ్యాడు. జడేజా బౌలింగ్‌లో మొయిన అలీ క్యాచ్‌ పట్టాడు. దీంతో ఢిల్లీ 9 ఓవర్లకు గాను మూడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.

  • 04 Oct 2021 09:54 PM (IST)

    ఢిల్లీ స్పీడుకు బ్రేక్‌..

    స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ఢిల్లీ రెండో వికెట్‌ కోల్పోయింది. శ్రేయస్‌ అయ్యర్‌, జోష్ హాజెల్‌వుడ్ విసిరిన బంతికి రితురాజ్ గైక్వాడ్ క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు.

  • 04 Oct 2021 09:38 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ..

    పృథ్వీ షా రూపంలో ఢిల్లీ తొలి వికెట్‌ను కోల్పోయింది. చాహర్‌ విసిరిన బంతికి షాట్‌కు ప్రయత్నించిన పృథ్వీ, డు ప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌ 3.1 ఓవర్లకు గాను 25 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 04 Oct 2021 09:33 PM (IST)

    రెండు ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌ ఎంతంటే..

    చెన్నై నిర్ధేశించిన 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆచితూచి ఆడుతోంది. రెండు ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ ఎలాంటి వికెట్లు నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ (14), ధావన్‌ (04) పరుగులతో ఉన్నారు.

  • 04 Oct 2021 09:15 PM (IST)

    ఢిల్లీ లక్యం ఎంతంటే..

    టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ బౌలింగ్‌లో బాగా రాణించింది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌ ఢిల్లీకి అనుకూలంగా మారింది. అయితే తొలి పది ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయిన చెన్నై ఒకానొక సమయంలో వందలోపే పరిమితమవుతారా? అన్న అనుమానాలు వచ్చాయి.. అయితే అంబటి రాయుడు రాణించడంతో చెన్నై చెప్పుకోదగ్గ స్కోరును సాధించింది. చెన్నై జట్టు 20 ఓవర్లకు గాను 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు సాధించింది. ఢిల్లీ గెలుపొందాలంటే 120 బంతుల్లో 137 పరుగులు చేయాల్సి ఉంది.

  • 04 Oct 2021 09:01 PM (IST)

    అంబటి రాయుడు హాఫ్‌ సెంచరీ పూర్తి..

    వరుస వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు జట్టు స్కోరు పెంచే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో హాఫ్‌ సెంచరీ చేసి మంచి ఆట తీరును కనబరిచాడు. చెన్నై జట్టు స్కోరు పెరగడంలో అంబటి కీలక పాత్ర పోషించాడని చెప్పాలి.

  • 04 Oct 2021 08:45 PM (IST)

    చెన్నై స్కోరు పెరిగేనా..?

    చెన్నై బ్యాట్స్‌మెన్‌ తబడుతున్నారు. 15 ఓవర్లు ముగిసినా జట్టు స్కోరు ఇంకా 100 మార్కు దాటలేకపోయింది. దీంతో ప్రస్తుతం క్రీజుల్లో ఉన్న ధోనీపైనే చెన్నై ఫ్యాన్స్‌కు ఆశలు ఉన్నాయి. ధోనీ ఏదైనా మ్యాజిక్‌ చేసి జట్టు స్కోరును పెంచుతాడా.? అని ఆశిస్తున్నారు. అయితే ఢిల్లీ మంచి బౌలింగ్‌తో రాణిస్తుండడంతో చెన్నై బ్యాట్స్‌మెన్‌ కేవలం సింగిల్స్‌కు మాత్రమే పరిమితమవుతున్నారు. 16వ ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై స్కోరు 4 వికెట్ల నష్టానికి 99 వద్ద కొనసాగుతోంది.

  • 04 Oct 2021 08:17 PM (IST)

    బరిలోకి దిగిన సారథి.. జట్టుకు అండగా నిలుస్తాడా.?

    వరుస వికెట్లు కోల్పోతున్న తరుణంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ఎమ్‌ఎస్‌ ధోనీ క్రీజులోకి దిగాడు. మరి జట్టు స్కోరును పెంచడంలో ధోనీ ఏ మేర ఫలిస్తారో చూడాలి. ఇక 9 ఓవర్‌లు ముగిసే సమయానికి చెన్నై 4 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది.

  • 04 Oct 2021 08:15 PM (IST)

    చెన్నైకి దెబ్బ మీద దెబ్బ.. మరో వికెట్‌ గాన్‌.

    చెన్నై సూపర్‌ కింగ్స్‌కి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. 60 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. తాజాగా రాబిన్‌ ఉతప్ప అశ్విన్‌ బౌలింగ్‌ బౌలర్‌కే క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం చెన్నై స్కోరు 8.3 ఓవర్లకు 62 వద్ద కొనసాగుతోంది.

  • 04 Oct 2021 08:09 PM (IST)

    కష్టాల్లోకి చెన్నై.. మరో వికెట్‌ గాన్‌.

    చెన్నై వరుస వికెట్లను కోల్పోతోంది. తాజాగా మూడో వికెట్‌ పడిపోయింది. మోయిన్‌ అలీ అక్సర్‌ బౌలింగ్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి శ్రేయస్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు.

  • 04 Oct 2021 08:07 PM (IST)

    7 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై స్కోరు ఎంతంటే..

    టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన చెన్నై ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయింది. అయితే వికెట్లు పోతున్నా స్కోరు మాత్రం బాగానే ఉంది. 7 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులతో ఉంది. ప్రస్తుతం క్రీజులో మోయిన్‌ అలీ (4), రాబిన్‌ ఉతప్ప (17) పరుగులతో ఉన్నారు.

  • 04 Oct 2021 08:04 PM (IST)

    మరో వికెట్‌ కోల్పోయిన చెన్నై.. రితురాజ్‌ అవుట్‌.

    స్వల్ప స్కోరు వ్యవధిలోనే చెన్నై మరో వికెట్‌ను కోల్పోయింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ 13 పరుగులకు వెనుతిరిగాడు. అన్రిచ్‌ నోర్జే విసిరన బంతికి అశ్విన్‌కు సింపుల్‌ క్యాచ్ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

  • 04 Oct 2021 07:50 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన చెన్నై..

    చెన్నై జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ ఫాప్‌డు ఫ్లెసిన్‌ 10 పరుగులు చేసిన అవుటయ్యాడు. అక్షర్ పటేల్‌ విసిరిన బంతికి శ్రేయస్‌ అయ్యర్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు.

  • 04 Oct 2021 07:39 PM (IST)

    మంచి ఆరంభం.. తొలి ఓవర్‌లోనే 16 పరుగులు.

    టాస్‌ ఓడి బ్యాటింగ్‌ మొదలు పెట్టిన చెన్నై మంచి ఆరంభాన్ని ప్రారంభించింది. తొలి ఓవర్‌లోనే 16 పరుగులు సాధించారు. ఇందులో రితురాజ్‌ గ్వైకాడ్‌ కేవలం 6 పరుగులు చేయగా మిగితావన్ని ఎక్స్‌ట్రా రూపంలో వచ్చాయి.

  • 04 Oct 2021 07:36 PM (IST)

    కలిసొచ్చిన రివ్వ్యూ..

    తొలి ఓవర్‌ రెండో బంతితోనే చెన్నైని భయపెట్టే ప్రయత్నం చేశాడు నోకియా. వేగంగా విసిరిన బంతి రితురాజ్ గైక్వాడ్ ప్యాడ్‌కు తగిలింది. దీంతో ప్లేయర్స్‌ అప్పిల్‌కు అంపైర్‌ అవుట్‌గా నిర్ణయించాడు. అయితే బ్యాట్స్‌మెన్‌ రివ్యూకి వెళ్లేసరికి థార్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా నిర్ణయం ప్రకటించాడు. దీంతో చెన్నైకి తొలి రివ్యూ కలిసొచ్చిందని చెప్పాలి.

  • 04 Oct 2021 07:23 PM (IST)

    ఇద్దరు ఆటగాళ్ల అరంగేట్రం..

    నేడు జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇద్దరు కొత్త ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. వీరిలో ఒకరు 26 ఏళ్ల ఆల్‌ రౌండర్‌ రిపిల్‌ పటేల్‌. ఇతను ఢిల్లీ జట్టు తరఫున అరంగేట్రం చేస్తున్నాడు. రిపిల్‌ 11 టీ20 మ్యాచ్‌ల్లో 189.10 స్ట్రైక్‌ రేట్‌తో 191 పరుగులు చేశాడు. ఇక చెన్నై నుంచి ఈరోజు ఇండియన్‌ ప్లేయర్‌ రాబిన్ ఉతప్ప అరంగేట్రం చేస్తున్నాడు. ఉతప్ప టీ20లో 190 మ్యాచ్‌లు ఆడి 4607 పరుగులు చేశాడు. మరి ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ సీజన్‌లో ఆడుతోన్న తొలి మ్యాచ్‌లో ఏమేర రాణిస్తారో చూడాలి.

  • 04 Oct 2021 07:18 PM (IST)

    రంగంలోకి దిగుతున్న ప్లేయర్స్ వీరే..

    CSK: MS ధోని (క్యాప్ట్-వికెట్‌ కీపర్‌), రితురాజ్ గైక్వాడ్, ఫాఫ్‌డు ప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

    DC: రిషబ్ పంత్ (క్యాప్ట్-వికె), పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, షిమ్రాన్ హెట్మయర్, రిప్పల్ పటేల్, అక్సర్ పటేల్, ఆర్. అశ్విన్, కగిసో రబాడా, అవేష్ ఖాన్, ఎన్రిక్ నార్ఖియా

  • 04 Oct 2021 07:15 PM (IST)

    టాస్‌ గెలిచిన ఢిల్లీ.. బౌలింగ్‌కు మొగ్గు.

    ఢిల్లీ, చెన్నైల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది. మొదట చెన్నైకి బ్యాటింగ్ చాన్స్‌ ఇచ్చి తక్కువ పరుగులకు చెన్నైని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఢిల్లీ ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఢిల్లీ తీసుకున్న ఈ నిర్ణయం ఏమేర ఫలిస్తుందో చూడాలి.

  • 04 Oct 2021 07:03 PM (IST)

    ధావన్‌ అదే జోరును కొనసాగిస్తాడా.?

    Dhavan

    ఈ సీజన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో దూసుకుపోతున్న శిఖర్‌ ధావన్‌ చెన్నైపై జరిగిన ప్రతీ మ్యాచ్‌లో దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ధావన్‌ చెన్నైపై తన మొదటి ఐపీఎల్‌ సెంచరీ సాధించాడు. మరి ఈ రోజు జరగనున్న మ్యాచ్‌లో కూడా ధావన్‌ అదే జోరును కొనసాగిస్తాడా.? లేదా చూడాలి.

Published On - Oct 04,2021 6:59 PM

Follow us
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..