IPL 2021 DC vs CSK: తడబడ్డ చెన్నై సూపర్ కింగ్స్.. ఢిల్లీ గెలుపునకు ఎన్ని పరుగులు కావాలంటే.
IPL 2021 DC vs CSK: ఐపీఎల్ 2021 సెకండ్ సీజన్‌లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ టేబుల్‌లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న హేమా హేమీలు చెన్నై, ఢిల్లీ..
IPL 2021 DC vs CSK: ఐపీఎల్ 2021 సెకండ్ సీజన్‌లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ టేబుల్‌లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న హేమా హేమీలు చెన్నై, ఢిల్లీ తలపడనుండడంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం విశేషం.
ఢిల్లీ బౌలర్లు చెలరేగడంతో సూపర్ కింగ్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. చెన్నై 136 వికెట్ల నష్టానికి కేవలం పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ విజయానికి 137 పరుగులు చేయాల్సి ఉంది. చెన్నై జట్టులో రాయుడు 55 పరుగులతో రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధించారు. ఇదిలా ఉంటే.. మ్యాచ్ సాగిన తీరు గమనిస్తే ఢిల్లీ తీసుకున్న నిర్ణయం సరైందేనని అనిపించకమానదు. మ్యాచ్ మొదలైన ప్రారంభం నుంచే ఢిల్లీ జట్టు చెన్నైని కట్టడి చేసింది. వరుస వికెట్లు పడడంతో చెన్నై పరుగుల వేగం నెమ్మదించింది. ఓపెనర్ ఫాప్‌డు ఫ్లెసిన్ 10 పరుగులకే అవుటయ్యాడు. అక్షర్ పటేల్ విసిరిన బంతికి శ్రేయస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఇక అనంతరం తక్కువ పరుగుల వ్యవధిలోనే రుతురాజ్ గ్వైకాడ్ 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక ఆతర్వాత మోయిన్ అలీ, రాబిన్ ఉతప్ప వెంటవెంటనే వికెట్లను కోల్పోయారు.
చెన్నై కష్టాల్లోకి వెళుతోందని అనుకుంటున్న తరుణంలో క్రీజులోకి వచ్చాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. కానీ ఢిల్లీ బౌలర్ల దాటికి ధోనీ కూడా ఆశించిన స్థాయిలో పరుగులు సాధించలేకపోయాడు. ముఖ్యంగా పిచ్ బౌలింగ్ బాగా అనుకూలించడంతో ఢిల్లీ బౌలర్లు చెలరేగిపోయారు. ఈ క్రమంలోనే చెన్నైని తక్కువ స్కోరుకు కట్టడి చేశారు.
ఢిల్లీ బౌలింగ్ విషయానికొస్తే నోకియా నాలుగు ఓవర్లు వేసి 37 పరుగులకు గాను 1 వికెట్ తీసుకున్నాడు. ఇక అందరికంటే ఎక్కువగా అక్షర్ నాలుగు ఓవర్లు కేవలం 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్, అవీశ్ ఖాన్ చేరో ఒక వికెట్ తీసుకున్నారు.
Also Read: Viral Video: అపార్టమెంట్లో మంటలు.. ముగ్గురు యువకుల సాహసం.. స్పైడర్ మ్యాన్ లాగా మూడో అంతస్తు ఎక్కి..
Andhra Pradesh: ఆ మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఈ నెల 7న అకౌంట్లలో నగదు జమ