Virat Kohli: క్రికెట్ చరిత్రలో ఆ అపురూప ఘట్టాన్ని కోహ్లి చేరుకుంటాడా.? సచిన్ రికార్డును బద్దలు కొట్టగలడా.?
Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండుల్కర్ ఒక ఎవరెస్ట్. చరిత్రలో ఎప్పటికీ తిరిగిరాయలేని రికార్డులను లిటిల్ మాస్టర్ పెట్టింది పేరు. ఇలాంటి..
Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండుల్కర్ ఒక ఎవరెస్ట్. చరిత్రలో ఎప్పటికీ తిరిగిరాయలేని రికార్డులను లిటిల్ మాస్టర్ పెట్టింది పేరు. ఇలాంటి రికార్డుల్లో వంద సెంచరీలు ఒకటి. సచిన్ తన క్రికెట్ కెరీర్‌లో 664 మ్యాచ్‌లు ఆడి 100 సెంచరీలను పూర్తి చేశాడు. అయితే ప్రస్తుతం ఈ రికార్డును తిరిగిరాసే వారు ఎవరు ఉన్నారన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. సచిన్ సృష్టించిన ఈ అద్భుత రికార్డును తిరగరాసే శక్తి ఒక్క విరాట్ కోహ్లికి మాత్రమే ఉందనేది కొందరు క్రీడా నిపుణులు అంచనా.
వంద అంతర్జాతీయ శతకాలు సాధించే సత్తా కోహ్లికి ఉందని ఇప్పటికే మాజీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ గతంలో ఓసారి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన మాట్లాడుతూ.. కోహ్లి ఫిట్‌గా ఉంటే 100 సెంచరీల మార్క్‌ను సులభంగా దాటేస్తాడని, కోహ్లి గొప్ప ఆటగాడని ప్రశంసలు కురిపించాడు. ఇదిలా ఉంటే కోహ్లి ఆ దిశగా ఏ మేర అడుగులు వేస్తున్నాడు. అసలు కోహ్లి ఈ రికార్డును సొంతం చేసుకోవడానికి ఇంకా ఎన్ని సెంచరీలు చేయాలో ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం విరాట్ కోహ్లి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో మొత్తం 71 సెంచరీలు సాధించాడు. అంటే కోహ్లి ప్రజంట్ అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో మూడో రెండో స్థానంలో నిలిచాడు.
అయితే ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ రిక్కీ పాంటింగ్ కూడా 71 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తర్వాతి స్థానంలో ప్రస్తుతం క్రికెట్ కెరీర్‌లో ఉన్న వారిలో వంద సెంచరీల రేసులో డి విల్లర్స్ 47 సెంచరీలతో ఉన్నాడు. ఇలా ఏ లెక్కన చూసుకున్న వంద సెంచరీలను చేరుకునే సత్తా ఒక్క కోహ్లికే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అంత సులువేం కాదు..
అయితే ఇది అంత సులువైన విషయం కూడా ఏమి కాదు. రోజురోజుకీ ఫిట్‌నెస్ తగ్గుతుండడం, ఒత్తిడి పెరుగుతుండడం ఆటగాళ్లకు సవాల్‌గా మారుతుంటాయి. సచిన్‌నే ఉదాహరణగా తీసుకుంటే.. అతని 99 సెంచరీకి 100వ సెంచరీకి మధ్య ఏకంగా ఏడాది సమయం పట్టింది. ఇక కోహ్లి ఇప్పటి వరకు సెంచరీ చేయకుండా 678 రోజులు గడుస్తోంది. ఒక ఆటగాడికి ఇన్ని రోజులు సెంచరీ లేకుండా ఉండడం కొంత ప్రతికూల అంశమేనని చెప్పాలి. దాదాపు రెండేళ్లలో సెంచరీలు లేకపోవడం కూడా కోహ్లి సెంచరీల సంఖ్య ముందుకు జరగకపోవడానికి ప్రధాన కారణం. ఒకవేళ ఈ రెండేళ్ల సమయంలో బాగా రాణించి ఉంటే కోహ్లి వంద సెంచరీల మార్కుకు ఇంకాస్త చేరువయ్యేవాడనేది క్రీడా నిపుణుల అభిప్రాయం. రెండేళ్ల కాలంలో ఒక్క సెంచరీ చేయకపోవడం కోహ్లీ 100 సెంచరీల మీద కచ్చితంగా ప్రభావం చూపుతుంది.
వయసు ప్రభావం ఉంటుందా.?
అంతేకాకుండా కోహ్లి వయసు ప్రస్తుతం 32 ఏళ్లు.. వచ్చే నెలలో 33 ఏళ్లు గడవనున్నాయి. ఇది కూడా వంద సెంచరీలకు అడ్డుగా మారే అవకాశం ఉందనేది నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే సచిన్ 30 ఏళ్ల దాటిన తర్వాత కూడా అద్భుత ఆట తీరును కనబరిచాడని, కాబట్టి వయసు అనేది అంశం కాదనేది మరి కొందరి వాదన. కేవలం సచిన్ మాత్రమే కాకుండా శ్రీలంక ప్లేయర్ సంగాక్కర, బ్రియన్ లారా కూడా 30 తర్వాత మంచి ఆటతీరును కనబరిచారని గుర్తు చేస్తున్నారు. ఇక కరోనా కారణంగా పెద్ద ఎత్తున మ్యాచ్‌లు వాయిదా పడడం కూడా కోహ్లి సెంచరీలకు బ్రేక్ పడడానికి కారణంగా చెబుతున్నారు.
మరి వచ్చే ఏడాది జరగనున్న మ్యాచ్‌లలో విరాట్ ఏ మేర రాణించనున్నాడనేది అతని వంద సెంచరీల మీద ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి క్రికెట్ చరిత్రలో ఎవరెస్ట్ లాంటిదైన వంద సెంచరీల రికార్డును కోహ్లి అధిగమిస్తాడో లేదో కాలమే నిర్ణయిస్తుంది.
Also Read: Drugs Case: కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్న ఆర్యన్ ఖాన్.. ఎన్‌సీబీ అధికారులు ఏం చేశారంటే..?
Pelli Sandadi: న్యూస్ యాంకర్‌గా మారిన శ్రీకాంత్ తనయుడు.. ఈ మార్పు వెనక కారణమేంటంటే..