T20 Cricket: క్రిస్‌గేల్, విరాట్ కోహ్లీలను వెనక్కు నెట్టిన పాకిస్తాన్ కెప్టెన్.. టీ20ల్లో అరుదైన రికార్డుతో తొలిస్థానం
అజామ్ తన ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన తరువాత వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనుకకు నెట్టేశాడు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ టీ 20 లో 7000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. సెంట్రల్ పంజాబ్ తరపున పాకిస్థాన్ దేశీయ టోర్నమెంట్ నేషనల్ టీ20 లో దక్షిణ పంజాబ్‌పై 49 బంతుల్లో 59 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. అజామ్ తన ఇన్నింగ్స్‌లో 25 పరుగులతో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీని వెనుకకు నెట్టేశాడు. అజామ్ 187 ఇన్నింగ్స్‌లలో 7,000 పరుగులు పూర్తి చేయగా, క్రిస్ గేల్ 192 ఇన్నింగ్స్‌లలో 7000 పరుగులు పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ 212 ఇన్నింగ్స్‌లలో 7000 పరుగులు పూర్తి చేశాడు.
65 సార్లు 50 కి పైగా పరుగులు.. బాబర్ అజామ్ 196 టీ 20 మ్యాచ్‌లలో 187 ఇన్నింగ్స్‌లలో 6 సెంచరీలు, 59 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని అత్యధిక స్కోరు 122 పరుగులుగా నమోదైంది. అదే సమయంలో, 61 అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌ల 56 ఇన్నింగ్స్‌లలో బాబర్ అజాబ్ 47 సగటుతో 2204 పరుగులు చేశాడు. తన అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, 20 అర్ధ సెంచరీలు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. మరోవైపు, విరాట్ కోహ్లీ టీ 20 లో ఇప్పటి వరకు సెంచరీ చేయలేకపోయాడు.
లిస్టులో 30 మంది ఆటగాళ్లు.. భారత్ నుంచి 4 గురు ఇప్పటి వరకు 30 మంది ఆటగాళ్లు టీ20ల్లో 7 వేలకు పైగా పరుగులు సాధించారు. ఇందులో 5 గురు 10 వేలకు పైగా పరుగులు సాధించారు. వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్ 14,276 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్‌తో పాటు, వెస్టిండీస్ కీరన్ పొలార్డ్, పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇందులో ఉన్నారు. అదే సమయంలో కేవలం 3 బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే పాకిస్తాన్ నుంచి 7 వేలకు పైగా పరుగులు చేయగలిగారు. బాబర్, మాలిక్‌తోపాటు మహ్మద్ హఫీజ్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. హఫీజ్ 7,314 పరుగులు చేశాడు. భారతదేశం నుంచి 4 గురు ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, సురేష్ రైనా, శిఖర్ ధావన్ ఈ లిస్టులో చేరారు.
ANOTHER RECORD FOR @babarazam258 ??? pic.twitter.com/jeHjUBRKh8
— Pakistan Cricket (@TheRealPCB) October 3, 2021
Yuvraj Singh: లైగర్‌తో తలపడ్డ యువరాజ్ సింగ్.. టగ్ ఆఫ్ వార్‌లో విజేత ఎవరంటే..? వైరలవుతోన్న వీడియో