IPL 2021: గత సీజన్‌లో ఒక్క సిక్స్‌ కూడా కొట్టలే.. ఐపీఎల్‌ 2021లో మాత్రం తగ్గేదేలే అంటోన్న ఆర్‌సీబీ ప్లేయర్..!

Glenn Maxwell: ఐపీఎల్ 2021 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రూ. 14.25 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ ఆస్ట్రేలియన్ ఆటగాడు ఐపీఎల్ చివరి సీజన్‌లో ఘోరంగా విఫలమయ్యాడు.

IPL 2021: గత సీజన్‌లో ఒక్క సిక్స్‌ కూడా కొట్టలే.. ఐపీఎల్‌ 2021లో మాత్రం తగ్గేదేలే అంటోన్న ఆర్‌సీబీ ప్లేయర్..!
Glenn Maxwell
Follow us
Venkata Chari

|

Updated on: Oct 04, 2021 | 12:38 PM

Royal Challengers Bangalore: ఐపీఎల్ 2021 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్లెన్ మాక్స్‌వెల్‌ను 14.25 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ ఆస్ట్రేలియన్ ఆటగాడు ఐపీఎల్ చివరి సీజన్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. అటువంటి పరిస్థితిలో అంత పెద్ద మొత్తాన్ని పొందడంపై ప్రశ్నలు తలెత్తాయి. కానీ, ప్రస్తుతం ఐపీఎల్ 2021 చివరి వారానికి చేరుకుంటుంది. ప్లేఆఫ్ రేసులో ఆర్‌సీబీ నిలబడింది. నిన్న జరిగిన మ్యాచులో గ్లెన్ మాక్స్‌వెల్ బ్యాట్ నుంచి విలువైన పరుగులు రావడంతో అది సాధ్యమైంది. దీంతో మ్యాక్స్‌వెల్ ఆర్‌సీబీ హీరోగా మారాడు. విరాట్ కోహ్లీ వచ్చిన వెంటనే గ్లెన్ మ్యాక్స్‌వెల్ బలం రెట్టింపు అయినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2021 లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడాడు. 407 పరుగులు సాధించాడు. అతని సగటు 40.70, స్ట్రైక్ రేట్ 145.35 గా నమోదైంది. నాల్గవ స్థానంలో బరిలోకి దిగుతూ మిడిల్ ఓవర్లలో అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే చివరి ఓవర్లలో ఫినిషర్ పాత్రను పోషిస్తున్నాడు. చాలా కాలం తర్వాత ఆర్‌సీబీ చేతిలో రెండు మ్యాచ్‌లు ఉన్నా ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి ముఖ్య కారణంగా ఉంది. ఈ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ బ్యాట్ ఐదు హాఫ్ సెంచరీలు సాధించింది. ఐపీఎల్ 2021 లో అత్యధికంగా 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంలో అతను కేఎల్ రాహుల్‌తో కలిసి అగ్రస్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్ 2021 లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 36 ఫోర్లు, 19 సిక్సర్లను సాధించాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌లో అతను మూడో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ (22), రుతురాజ్ గైక్వాడ్ (20) మాత్రమే అతని కంటే ముందున్నారు. విచిత్రం ఏమిటంటే, గత ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్ మొత్తం సీజన్‌లో ఒక సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. అతను ఐపీఎల్ 2020 లో పంజాబ్ కింగ్స్ కోసం 13 మ్యాచ్‌లు ఆడాడు.

ఐపీఎల్ 2020 వేలంలో పంజాబ్ కింగ్స్ 11 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్లెన్ మాక్స్‌వెల్‌ని కొనుగోలు చేసింది. కానీ, సీజన్ మొత్తం పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు. అతను 13 మ్యాచ్‌ల్లో 15.42 సగటుతో 108 పరుగులు చేయగలిగాడు. 32 పరుగులు అతని అత్యధిక స్కోరుగా ఉంది. అలాగే, అతని స్ట్రైక్ రేట్ కూడా 101.88 గా ఉంది. టీ20 క్రికెట్ పరంగా ఇది చాలా అత్యల్పంగా నమోదైంది. మొత్తం సీజన్‌లో అతను కేవలం తొమ్మిది ఫోర్లు మాత్రమే కొట్టాడు. ఈ కారణంగా పంజాబ్ కింగ్స్ ఈ సారి గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను తీసుకోలేదు.

ఐపీఎల్ 2014 లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ అత్యంత విజయవంతమైనవాడిగా నిలిచాడు. అప్పుడు అతను పంజాబ్ కింగ్స్ తరపున ఆడి 16 మ్యాచ్‌లలో 552 పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో 48 ఫోర్లు, 36 సిక్సర్లు కొట్టాడు. అప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. కానీ, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. దీని తర్వాత మళ్లీ 2017 లో అతను 300 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఈ రెండు సీజన్‌ల తర్వాత, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2021 లో మళ్లీ విజయం సాధించాడు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2012 నుంచి ఐపీఎల్‌లో పాల్గొన్నాడు. అప్పటి నుంచి అతను ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో భాగం అయ్యాడు. ఇప్పటివరకు అతను 94 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 24.51 సగటుతో 152.59 స్ట్రైక్ రేట్‌తో 1912 పరుగులు చేశాడు. అతని పేరు మీద మొత్తం 11 ఐపీఎల్ ఫిఫ్టీలు ఉన్నాయి. అతను బౌలింగ్‌లో కూడా విజయం సాధించాడు. ఐపీఎల్‌లో అతని పేరుతో 22 వికెట్లు ఉన్నాయి.

Also Read: Yuvraj Singh: లైగర్‌తో తలపడ్డ యువరాజ్ సింగ్.. టగ్ ఆఫ్‌ వార్‌లో విజేత ఎవరంటే..? వైరలవుతోన్న వీడియో

IPL 2021: ప్లేఆఫ్‌లో నంబర్ 4 ఎవరు.. రోహిత్, మోర్గాన్, శాంసన్‌లలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో తెలుసా?

40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు