AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant Fungus: మానవ శరీరంలో ప్లాంట్ ఫంగస్.. కోల్‌కత్తాలో కొత్త కేసు నమోదు..

తాజాగా భారతదేశంలో ఓ అరుదైన కేసు వెలుగుచూసింది. కోల్‌కత్తాకు చెందిన 61 ఏళ్ల వ్యక్తి కిల్లర్ ప్లాంట్ ఫంగస్‌ సంక్రమించింది.  ఈ అరుదైన వ్యాధికారక సంక్రమణ ప్రపంచంలోనే మొదటి కేసుగా నిలిచింది.

Plant Fungus: మానవ శరీరంలో ప్లాంట్ ఫంగస్.. కోల్‌కత్తాలో కొత్త కేసు నమోదు..
Fungus
Nikhil
|

Updated on: Apr 07, 2023 | 3:45 PM

Share

ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా కొత్త రకాల అనారోగ్యాలను మానవులు గురవుతున్నారు. మూడేళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించిందో? అందరికీ తెలిసిందే. దీంతో పరిశోధకులు ఎప్పటికప్పుడు కొత్త వ్యాధుల గురించి, అవి మానవాళిపై చూపే ప్రభావంపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే తాజాగా భారతదేశంలో ఓ అరుదైన కేసు వెలుగుచూసింది. కోల్‌కత్తాకు చెందిన 61 ఏళ్ల వ్యక్తి కిల్లర్ ప్లాంట్ ఫంగస్‌ సంక్రమించింది.  ఈ అరుదైన వ్యాధికారక సంక్రమణ ప్రపంచంలోనే మొదటి కేసుగా నిలిచింది. దీంతో మొక్కల ఫంగల్ ఇన్ఫెక్షన్లు మానవులకు ఎలా వ్యాపించవచ్ఛు? అనే అంశంపై పరిశోధనలు మొదలు పెట్టారు. కొండ్రోస్టెరియం పర్పురియం అని పిలిచే ఈ మొక్క శిలీంధ్రం సిల్వర్ లీఫ్ వ్యాధిని కలిగిస్తుందని పరిశోధకులు తేల్చారు. ప్రధానంగా ఈ ఫంగస్ గులాబీ మొక్కలను ప్రభావితం చేస్తుందని వైద్యులు వివరించారు. ఈ ఫంగస్ మొక్కను కత్తిరించినప్పుడు బహిర్గతమయ్యే ప్రాంతంలో పెరుగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం వచ్చిన ప్లాంట్ ఫంగస్ కేసు వచ్చిన వృద్ధుడు ఎక్కువగా పుట్టగొడుగుల వద్ద పని చస్తాడు. ఈ ప్లాంట్ ఫంగస్‌కు ఎక్కువ కాలం గురికావడం వల్ల అతని ఈ ఫంగస్‌ను వచ్చి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక ఫంగస్‌ జన్యుపరమైన గ్రహణశీలత వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. 

ఈ అరుదైన ప్లాంట్ ఫంగస్ సోకిన వ్యక్తికి మూడు నెలలుగా గొంతు బొంగురుపోవడం, దగ్గు, పునరావృత ఫారింగైటిస్, అలసట, మింగడంలో ఇబ్బంది  వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే బాధితుడికి మధుమేహం, హెచ్ఐవీ, మూత్రపిండ లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి, రోగనిరోధక శక్తిని తగ్గించే డ్రగ్స్ తీసుకోవడం వంటి చరిత్ర లేదని పేర్కొన్నారు. ఓ మాటలో చెప్పాలంటే ఈ ఫంగస్‌కు గురైన వ్యక్తికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. అయితే ఆ వ్యక్తి చాలా కాలం నుంచి కుళ్లిపోతున్న పదార్థాలు, పుట్టగొడుగులు, వివిధ మొక్కల శిలీంధ్రాలతో పని చేస్తున్నాడు. ఆ వ్యక్తి వృత్తి ప్లాంట్ మైకాలజిస్ట్. అందువల్లే ఈ ఫంగస్‌కు గురైనట్లు వైద్యులు నివేదిస్తున్నారు. మెడ వద్ద సిటీ స్కాన్‌లో కుడి పారాట్రాషియల్ వద్ద చీము ఉన్నట్లు తేలింది. అలాగే ఎండోస్కోపీ ద్వారా మొక్కల ఫంగస్‌ను వైద్యులు కనుగొన్నారు. ప్రస్తుతం బాధితుడికి యాంటి ఫంగల్ ట్రీట్‌మెంట్‌ను ఇస్తున్నారు. దాదాపు 60 రోజులుగా బాధితుడికి ఈ ట్రీట్‌మెంట్ ఇవ్వగా ప్రస్తుతం సాధారణ స్థితికి వచ్చాడు. అలాగే వ్యాధి మళ్లీ వచ్చే అవకాశం కూడా ఉండదని వైద్యులు చెబుతున్నారు. 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ