Fungal Infection: ఫంగల్ ఇన్పెక్షన్లకు కారణాలు ఏమిటి? ఈ 5 సింపుల్ హోం రెమెడీస్తో సమస్యకు చెక్ పెట్టొచ్చు..!!
మనలో చాలామంది తమ జీవితంలో ఏదొక సమయంలో ఫంగల్ ఇన్ఫెక్షన్కు గురవుతారు. పరిశుభ్రత సరిగ్గా పాటించకపోవడం, తేమ, వేడి ఉష్ణోగ్రతలు ఫంగస్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.

మనలో చాలామంది తమ జీవితంలో ఏదొక సమయంలో ఫంగల్ ఇన్ఫెక్షన్కు గురవుతుంటారు. పరిశుభ్రత సరిగ్గా పాటించకపోవడం, తేమ, వేడి ఉష్ణోగ్రతలు ఫంగస్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. కొని సాధారణ ఫంగల్ ఇన్ఫెక్షన్లలో దద్దుర్లు, బొబ్బలు, రింగ్ వార్మ్, చర్మంపై పొలుసులుగా ఏర్పాడటం వంటివి ఉన్నాయి. సహాజంగా శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ తక్కువగా ఉన్నవారిలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్నలు త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటిని నివారణకు ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల మందులు, యాంటీ ఫంగల్ లోషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఇంట్లో లభించే కొన్ని రకాల పదార్థాలతోనూ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
ఏదైనా హోం రెమెడీ పద్దతులు, ఇతర ఔషధాలను ఉపయోగించే ముందు ఇన్ఫెక్షన్ సోకిన ప్రదేశాన్ని సబ్బుతో రోజుకు రెండుసార్లు శుభ్రం చేస్తే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఈ ఫంగల్ ఇన్పెక్షన్ను నివారించే ఇంటి చిట్కాలేంటో తెలుసుకుందాం.
1. తేనె:
తేనె ఫంగల్ ఇన్ఫెక్షన్ చికిత్సలలో ఒకటి. ఇందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. ఇది చర్మ వ్యాధులకు కారణమయ్యే ఫంగస్, బ్యాక్టీరియాను చంపడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతంలో ముడి తేనె పూస్తే మంచి ఫలితం ఉంటుంది.
2. వేప ఆకులు:
వేప ఆకుల్లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. వేపనీటిని ఫంగస్ ప్రభావిత ప్రాంతంలో పూయడం వల్ల శిలీంధ్ర వ్యాధులు నయం అవుతాయి. వేపనీటిని తయారు చేయడానికి, వేప ఆకులను మూడులేదా ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి. తర్వాత ఆ నీటిని ఉపయోగించాలి.
3. టీ ట్రీ ఆయిల్ :
టీ ట్రీ ఆయిల్ ఒక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ అనే మూడు లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లకు అత్యంత శక్తివంతమైన సహజ చికిత్సల్లో ఒకటిగా ఉపయోగిస్తారు. ఇది మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
4. అలోవేరా:
అలోవెరాలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీబాక్టీరియల్ లక్షణాలుపుష్కలంగా ఉన్నాయి. ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. అంతేకాదు చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలకు సహజ నివారిణిగా ఉపయోగపడుతుంది. చర్మానికి ఉపశమనం కలిగించడమే కాకుండా వ్యాధిని నయం చేస్తుంది.
5. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇదొక శక్తివంతమైన మూలికా ఔషదంగా చెప్పవచ్చు. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. స్కాల్ప్, రింగ్ వార్మ్ ను నయం చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు. చర్మంపై రోజుకు రెండు లేదా మూడు సార్లు రాయడం వల్ల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం



