AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petticoat Cancer: మై డియర్ మహిళలూ..! ‘పెట్టీకోట్ క్యాన్సర్’తో జాగ్రత్త

క్యాన్సర్ మాములు మహమ్మారి వ్యాధి కాదు. వచ్చిందంటే మనిషిని చిక్కి.. శల్యం చేస్తోంది. ప్రాణాలు హరించేస్తోంది. తాజాగా వైద్య నిపుణులు మహిళలకు అలెర్ట్ జారీ చేశారు. లంగా బొందును గట్టిగా బిగించి కట్టే అలవాటు ఉన్నవారకి క్యాన్సర్ ముప్పు ఉందని వెల్లడించారు.

Petticoat Cancer: మై డియర్ మహిళలూ..!  ‘పెట్టీకోట్ క్యాన్సర్’తో జాగ్రత్త
Tightly Tied Waist Cord
Ram Naramaneni
|

Updated on: Nov 07, 2024 | 12:45 PM

Share

క్యాన్సర్‌.. ఇప్పటి వరకూ సరైన మందే లేని వ్యాధి. ఇది రకరకాల రూపాలలో ప్రాణాలను హరించివేస్తుంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌, లంగ్‌ క్యాన్సర్‌, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్.. సర్వైకల్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్… ఇంకా పలు రకాల క్యాన్సర్స్‌ బారినపడుతున్నారు ప్రజలు. తాజాగా మరో రకమైన క్యాన్సర్‌ గురించి వెలుగులోకి వచ్చింది. కాన్సర్‌కి కాదేదీ అనర్హం అన్నట్టుగా మహిళలు ధరించే లంగా నాడా(బొందు) కారణంగా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని ఓ రీసెర్చ్‌లో వెల్లడైంది. ఈ అధ్యయన వివరాలు బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. లంగాను గట్టిగా బిగించి కట్టుకోవడం వల్ల క్యాన్సర్ బారినపడిన ఇద్దరు మహిళలకు తాము చికిత్స చేసినట్టు భారతీయ వైద్యుల బృందం ఒకటి తెలిపింది.

లంగా బొందును గట్టిగా బిగించి కట్టడం వల్ల అది చర్మానికి ఒరుసుకుపోయి పుండ్లు ఏర్పడి చర్మ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని డాక్టర్లు తెలిపారు. గతంలో దీనిని ‘చీర క్యాన్సర్’గా వ్యవహరించే వారని, కానీ, లంగా నాడా బిగించి కట్టడం వల్ల ఈ క్యాన్సర్ వస్తోంది కాబట్టి ఇప్పుడు దీనిని ‘పెట్టీకోట్ క్యాన్సర్’గా పిలవాలని పేర్కొన్నారు. తమ వద్దకు వచ్చిన రెండు కేసుల్లో ఒక మహిళ వయసు 70 సంవత్సరాలని, మరో మహిళ వయసు 60 ఏళ్లని వైద్యులు తెలిపారు. 70 ఏళ్ల మహిళకు 18 నెలల నుంచి నడుము కుడిపక్క అయిన గాయం మానడం లేదని, 60 ఏళ్ల మహిళ కూడా రెండేళ్లుగా ఇదే రకమైన గాయంతో బాధపడుతున్నట్టు చెప్పారు. ఈ గాయాలను మార్జొలిన్ వ్రణంగా పేర్కొన్నారు. దీని బారిన పడకుండా ఉండేందుకు వదులుగా ఉండే లో దుస్తులు ధరించడం మంచిదని, తద్వరా ఈ క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని మెడికల్ టీమ్ తెలిపింది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి