Pea Benefits: తినేటప్పుడు బఠానీలు పారేస్తున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు..
మన దేశంలో అనేక వంటకాలు, కూరలల్లో బఠానీ (మటర్) లను కలుపుతారు. బఠానీలు లేకుండా పోహా లేదా పనీర్ లాంటి కూరలు అసంపూర్ణంగా కనిపిసస్తాయి. బఠానీలు ఆహార రుచిని మరింత పెంచుతాయి.
మన దేశంలో అనేక వంటకాలు, కూరలల్లో బఠానీ (మటర్) లను కలుపుతారు. బఠానీలు లేకుండా పోహా లేదా పనీర్ లాంటి కూరలు అసంపూర్ణంగా కనిపిసస్తాయి. బఠానీలు ఆహార రుచిని మరింత పెంచుతాయి. రుచితో పాటు, బఠానీలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. చాలా మందికి దాని ప్రయోజనాల గురించి తెలియదు. తినేటప్పుడు ఆహార పదార్థాల నుంచి బఠానీలను పారేస్తారు. మీరు కూడా బఠానీలు తినకపోతే.. ఈ రోజు నుంచే తినడం ప్రారంభించాలని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. బఠానీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొంటున్నారు. మటర్ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బఠానీల ప్రయోజనాలు..
తక్కువ కొలెస్ట్రాల్: బఠానీ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. బఠానీలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. దీని కారణంగా, కొలెస్ట్రాల్ ఫలకం సిరల్లో పేరుకుపోదు. అడ్డుపడే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. ఇవి గుండెకు కూడా చాలా మేలు చేస్తాయి.
మధుమేహంలో ప్రయోజనకరంగా ఉంటుంది: డయాబెటిక్ పేషెంట్లు కూడా బఠాణీలను తీసుకోవడం మంచిది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని కారణంగా బఠానీలు తినడం వల్ల చక్కెర స్థాయి పెరగదు. బఠానీలలో ప్రోటీన్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి డయాబెటిస్‌లో ప్రయోజనకరంగా ఉంటాయి.
చర్మానికి ప్రయోజనకరమైనది: ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లతో సహా అనేక పోషకాలు బఠానీలలో దాగున్నాయి. బఠానీల్లో విటమిన్ బి6, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు చర్మంపై ముడుతలను తొలగించడంలో సహాయపడతాయి.
ప్రోటీన్ లోపాన్ని తొలగిస్తాయి: బఠానీలలో ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. జుట్టు, గోళ్లకు ప్రోటీన్ ప్రయోజనకరంగా ఉంటుంది. బఠానీలు తినడం ద్వారా ప్రోటీన్ లోపం తొలగిపోతుంది. దీని వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
జీర్ణక్రియలో ప్రయోజనకరంగా ఉంటుంది: బఠానీలు తినడం వల్ల జీర్ణక్రియకు కూడా మేలు చేకూరుతుంది. బఠానీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణక్రియ సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే బఠానీలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..