AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White Onion: తెల్ల ఉల్లిపాయలు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు.. ఈ సమస్యలకు చెక్‌

ఉల్లిపాయ మన వంటగదిలో చాలా ముఖ్యమైన భాగం. ప్రతి వంటకాల్లో ఉల్లిపాయలు తప్పనిసరి కావాల్సిందే. ఉల్లిని భారతదేశంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇది రుచిని..

White Onion: తెల్ల ఉల్లిపాయలు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు.. ఈ సమస్యలకు చెక్‌
White Onion
Subhash Goud
|

Updated on: Oct 24, 2022 | 9:26 AM

Share

ఉల్లిపాయ మన వంటగదిలో చాలా ముఖ్యమైన భాగం. ప్రతి వంటకాల్లో ఉల్లిపాయలు తప్పనిసరి కావాల్సిందే. ఉల్లిని భారతదేశంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఉల్లి వాసన ఘాటుగా ఉంటుంది. అందుకే కొందరు పెద్దగా ఇష్టపడరు. కానీ ఇది చాలా తీవ్రమైన వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది. అయితే తెల్ల ఉల్లిపాయల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

తెల్ల ఉల్లిపాయల ప్రయోజనాలు:

సాధారణ ఉల్లిపాయలతో పోలిస్తే తెల్ల ఉల్లిపాయల దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. ఇది మార్కెట్లలో చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించినంత వరకు దాని ప్రాముఖ్యత పెరుగుతుంది. తెల్ల ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

మధుమేహానికి తెల్లుపాల్లిపాయలు:

మధుమేహం ఉ్ననవాళ్లు తెల్ల ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు సహాయపడుతుంది.

క్యాన్సర్:

క్యాన్సర్ చాలా తీవ్రమైన వ్యాధి. ఇది ప్రారంభ దశలో గుర్తించబడకపోతే అది ప్రాణాంతకం కూడా కావచ్చు. దీనిని నివారించడానికి తెల్ల ఉల్లిపాయలు సహాయపడతాయి. ఎందుకంటే ఇందులో క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడే ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మీరు ఉల్లిపాయలను పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు.

జీర్ణక్రియ:

తెల్ల ఉల్లిపాయలను తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో పోరాడడంలో సహాయపడుతుంది. అందుకే దీనిని తరచుగా సలాడ్‌లలో చేర్చుతారు. తెల్ల ఉల్లిపాయల్లో ఫైబర్, ప్రీబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన పొట్టకు మేలు చేస్తాయి. దీని వల్ల జీర్ణక్రియను మెరుగుపడుతుంది.

రోగనిరోధక శక్తి:

తెల్ల ఉల్లిపాయల వల్ల ఇన్ఫెక్షన్ల నుండి మనం రక్షించుకోవచ్చు. తెల్ల ఉల్లిపాయను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి