AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad Breath: మీ సమస్య ఇతరులను ఇబ్బంది పెట్టొచ్చు.. ఈ టిప్స్ తో పరిష్కారం చెప్పండి..

నోటి దుర్వాసన సమస్యను చాలామంది తేలికగా తీసుకుంటారు. మనం ఎదుటివాళ్ల వద్ద మాట్లాడుతున్నప్పుడు, లేదా ఆఫీసులో మన చుట్టుపక్కల వాళ్లు.. మన దుర్వాసన సమస్య ద్వారా ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది నేరుగా..

Bad Breath: మీ సమస్య ఇతరులను ఇబ్బంది పెట్టొచ్చు.. ఈ టిప్స్ తో పరిష్కారం చెప్పండి..
Bad Breath
Amarnadh Daneti
|

Updated on: Oct 23, 2022 | 10:05 PM

Share

నోటి దుర్వాసన సమస్యను చాలామంది తేలికగా తీసుకుంటారు. మనం ఎదుటివాళ్ల వద్ద మాట్లాడుతున్నప్పుడు, లేదా ఆఫీసులో మన చుట్టుపక్కల వాళ్లు.. మన దుర్వాసన సమస్య ద్వారా ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది నేరుగా మనకు చెప్పకపోయినా, మరికొంత మంది నోరు కొంపు కొడుతుందని ముఖం మీద చెప్తేస్తారు. స్మోకింగ్ వల్ల నోటి దుర్వాసన వస్తుంది. అలాగే పళ్లు శుభ్రంగా తోముకోకపోయినా, ఏదైనా తిన్న  తర్వాత నోటిని శుభ్రం చేసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన సమస్య ఎదురవుతుంది. నోటి దుర్వాసనతో చాలా మంది బాధపడుతుంటారు. ఈసమస్య వల్ల మనలో మనం కుమిలిపోతూ ఉంటాం.. నోటి దుర్వాసన వల్ల మన పక్కవారూ ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా పరిశుభ్రంగా ఉండకపోవడం.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో నోటి దుర్వాసన వస్తుంది. దీర్ఘకాల నోటి వ్యాధుల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. వెల్లులి, ఉల్లిపాయలు వంటి ఆహారాల్లో ఉండే దుర్వాసన గల నూనెలు.. ఊపిరితిత్తులకు చేరినప్పుడు నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో నోటి దుర్వాసన కలిగించకుండా ఉండే ఆహారాలు ఉన్నాయి. ఈఆహార పదార్థాలు నోటి దుర్వాసనతో పోరాడతాయి. అవెంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

గ్రీన్ టీ

గ్రీన్ టీలో కాటెచిన్ అనే ఎనర్జిటిక్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది నోటి దుర్వాసన కలిగించే సల్ఫర్ సమ్మేళనాలను తగ్గించడం ద్వారా బ్యాక్టిరియాను నిరోధిస్తుంది.

కొన్ని రకాల పండ్లు

నిమ్మ, దానిమ్మ, యాపిల్, బత్తాయి, నారింజ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది బ్యాక్టిరియాను కంట్రోల్ చేయడానికి మాత్రమే కాకుండా.. చిగుళ్ల వ్యాధులు, చిగురువాపుతో పోరాడటానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

పెరుగు

పెరుగులో ఫ్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి చెడు దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను అధిగమిస్తుంది. వీటిలో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉండటంతో శరీరంలో క్రిములు పెరగడాన్ని తగ్గిస్తుంది.

తులసి

తులసిలోని పాలీఫెనాల్స్ అనే సహజ అణువులు నోటి దుర్వాసనకు చికిత్స అందించడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తులసిని ఏ విధంగా తీసుకున్నా.. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.

అల్లం

అల్లంలో ఉండే 6-జింజెరాల్ నోటిలోని సల్ఫర్ సమ్మేళనాల విచ్ఛినానికి సహాయపడే లాలాజల ఎంజైమ్ ను ఇస్తుంది. అల్లం లేదా అల్లం ఉపయోగించిన పదార్థాలను తీసుకుని నోటి దుర్వాసనను కంట్రోల్ చెసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Follow Us
TV9 సమ్మిట్‌లో పలు అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మోదీ ..
TV9 సమ్మిట్‌లో పలు అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మోదీ ..
నారింజ పండు.. పోషకాలు మెండు.. లాభాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..
నారింజ పండు.. పోషకాలు మెండు.. లాభాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..
ముంబై ఇండియన్స్‌లో ఆంధ్రా కింగ్.. తోపులైనా తోకముడవాల్సిందే..!
ముంబై ఇండియన్స్‌లో ఆంధ్రా కింగ్.. తోపులైనా తోకముడవాల్సిందే..!
విద్యుత్‌ అక్కర్లేదు.. వైఫై అవసరమే లేదు.. సోలార్‌ సీసీ కెమెరాలు..
విద్యుత్‌ అక్కర్లేదు.. వైఫై అవసరమే లేదు.. సోలార్‌ సీసీ కెమెరాలు..
బోల్డ్ పర్ఫామెన్స్‌లో ఈ అమ్మడిని కొట్టేవారే లేరు గురూ..!!
బోల్డ్ పర్ఫామెన్స్‌లో ఈ అమ్మడిని కొట్టేవారే లేరు గురూ..!!
ఓటర్లుగా కాదు, నాయకులు అవ్వండి..: రామ్‌దేవ్
ఓటర్లుగా కాదు, నాయకులు అవ్వండి..: రామ్‌దేవ్
వాతావరణ శాఖ హెచ్చరిక.. వచ్చే 3 రోజులు పిడుగులతో భారీ వర్షాలు!
వాతావరణ శాఖ హెచ్చరిక.. వచ్చే 3 రోజులు పిడుగులతో భారీ వర్షాలు!
సర్పంచ్ కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినన యువకుడు
సర్పంచ్ కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినన యువకుడు
అదిరిపోయే ప్లాన్‌..కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ
అదిరిపోయే ప్లాన్‌..కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ
ఈ రియల్ 'ధురంధర్' కన్నీటి కథ గురించి తెలుసా? పాపం పాక్ జైలులోనే..
ఈ రియల్ 'ధురంధర్' కన్నీటి కథ గురించి తెలుసా? పాపం పాక్ జైలులోనే..