Health: ఆవలింతలు ఎక్కువగా వస్తున్నాయా.. బీ అలర్ట్.. నిపుణుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు..

మైగ్రేన్ కేవలం తలనొప్పి మాత్రమే కాదు. ఇది కలిగించే దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. నొప్పి, అలసట, వికారం, తిమ్మిరి, చిరాకు, మాట్లాడటం కష్టవడం, తాత్కాలికంగా దృష్టిని కోల్పోవడం వంటివి దీని లక్షణాలు. పొత్తికడుపు..

Health: ఆవలింతలు ఎక్కువగా వస్తున్నాయా.. బీ అలర్ట్.. నిపుణుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
Yawning
Follow us

|

Updated on: Oct 23, 2022 | 6:41 PM

మైగ్రేన్ కేవలం తలనొప్పి మాత్రమే కాదు. ఇది కలిగించే దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. నొప్పి, అలసట, వికారం, తిమ్మిరి, చిరాకు, మాట్లాడటం కష్టవడం, తాత్కాలికంగా దృష్టిని కోల్పోవడం వంటివి దీని లక్షణాలు. పొత్తికడుపు మైగ్రేన్, ఋతు మైగ్రేన్, వెస్టిబ్యులర్ మైగ్రేన్ వంటివి వీటిలో రకాలు అని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అయితే.. మైగ్రేన్ వచ్చే దశలో కొన్ని సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన సరైన విధంగా చికిత్స తీసుకుంటే చాలా వరకు మైగ్రేన్ ఇబ్బందులను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రోడ్రోమ్ దశలో 24 నుంచి 48 గంటల మధ్య ఎప్పుడైనా తలనొప్పి రావచ్చు. దీనిని ‘ముందస్తు దశ’ లేదా ‘ముందస్తు తలనొప్పి’ అని కూడా అంటారు. రెండో దశ లో ఇంద్రియాలలో మార్పు వస్తుంది.దృష్టిలో లోపాలు వస్తాయి. అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్ ప్రకారం.. మైగ్రేన్ ఉన్న వారిలో 25-30% మంది ఈ దశలో ఉన్నట్లు తేలింది. మూడో దశలో ఒక వైపున తలనొప్పి ఉంటుంది. పల్స్ రేట్ లో మార్పులు, శరీరం త్వరగా అలిసిపోయినట్లు లక్షణాలు కనిపిస్తాయి.

చివరి మైగ్రేన్ దశలో వ్యక్తులు బాగా అలసిపోయినట్లు కనిపిస్తారు. డిప్రెషన్ లేదా ఏకాగ్రతలో ఇబ్బంది, అర్థం చేసుకోవడం ఇబ్బందులు వంటివి వస్తాయి. ఈ హెచ్చరిక సంకేతాలను గుర్తించడం ద్వారా మైగ్రేన్ తో సంబంధం ఉన్న కొంత నొప్పిని వదిలించుకోవడానికి అవకాశం ఉంది. ఇది మందులు తీసుకోవడం లేదా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా చేసుకోవచ్చు. అసాధారణమైన ఆహార అలవాట్లు కలిగి ఉండటం వల్ల మైగ్రేన్ రావచ్చు. కొన్ని సార్లు విపరీతంగా ఆవలింతలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మెడ నొప్పి లేదా దృఢత్వం – సాధారణంగా, మెదడు నుండి గర్భాశయ వెన్నెముక వరకు విస్తరించిన నరాల ఫైబర్స్ మరియు మెదడులోకి తిరిగి లూప్ చేయడం వల్ల ప్రజలు కండరాల నొప్పిని అనుభవిస్తారు.

పగటిపూట ఎక్కువగా నిద్రపోతున్నట్లు అనిపించడం, మత్తు, అలసట వంటివి మైగ్రేన్ లక్షణాలుగా చెప్పవచ్చు. అంతే కాకుండా తరచుగా మూత్రవిసర్జన జరుగుతుంది. ఆ సమయంలో మూత్రంలో మంట వస్తుంది. మైగ్రేన్ చికిత్సకు మందులు అందుబాటులో ఉన్నప్పటికీ జీవన శైలిలో మార్పులు చేయడం వల్ల మైగ్రేన్ నొప్పిని తగ్గించుకోవచ్చు. ఒక రోజులో 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. మానసిక ఒత్తిడికి గురి కాకుండా మనస్సుకు విశ్రాంతి ఇవ్వాలి. ఎలాంటి ఆలోచనలకు అవకాశం ఇవ్వకుండా యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి