Tech Tips: స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ కవర్‌ యెల్లో కలర్‌లోకి ఎందుకు మారుతుందో తెలుసా.? ఎలా క్లీన్‌ చేయాలంటే..

స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే ప్రతీ ఒక్కరూ బ్యాక్‌ కవర్‌ను వాడుతుంటారు. ఫోన్‌కు ఎలాంటి డ్యామేచ్‌ కాకుండా ఈ కవర్‌ ఉపయోగపడుతుంది. అయితే ఫోన్‌ కలర్‌ కనిపించేందుకు చాలా మంది ట్రాన్స్‌పరేంట్‌ (పారదర్శకం) పౌచ్‌లను ఉపయోగిస్తారు...

Tech Tips: స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ కవర్‌ యెల్లో కలర్‌లోకి ఎందుకు మారుతుందో తెలుసా.? ఎలా క్లీన్‌ చేయాలంటే..
Phone Cover
Follow us

|

Updated on: Oct 23, 2022 | 8:09 PM

స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే ప్రతీ ఒక్కరూ బ్యాక్‌ కవర్‌ను వాడుతుంటారు. ఫోన్‌కు ఎలాంటి డ్యామేచ్‌ కాకుండా ఈ కవర్‌ ఉపయోగపడుతుంది. అయితే ఫోన్‌ కలర్‌ కనిపించేందుకు చాలా మంది ట్రాన్స్‌పరేంట్‌ (పారదర్శకం) పౌచ్‌లను ఉపయోగిస్తారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ పౌచ్‌లు యెల్లో కలర్‌లోకి మారిపోతుంటాయి. మీలో చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొని ఉంటారు కదూ! ఇంతకీ పౌచ్‌ల రంగు ఎందుకు మారుతుంది.? వాటిని ఎలా క్లీన్‌ చేసుకోవాలి? లాంటి వివరాలపై ఓ లుక్కేయండి..

సాధారణంగా ఈ ట్రాన్స్‌పరేంట్ కవర్‌లను TPU (థర్మో ప్లాస్టిక్‌ పాలీ యురేథిన్‌) మెటీరియల్‌తో తయారు చేస్తారు. కవర్‌ రంగు మారడానికి ప్రధాన కారణం సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలు, వేడి. సూర్యుడి నుంచి కిరణాలకు కవర్‌లోని టీపీయూ కెమికల్స్‌ రియాక్షన్‌ అవుతాయి. దీంతో రంగు మారుతుంది. అలాగే ఫోన్‌ చార్జింగ్ చేసేప్పుడు లేదా ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పుడు వచ్చే వేడి వల్ల కూడా రంగు మారుతంది. ఇక రంగు మారడానికి మరో కారణం చేతి నుంచి వచ్చే చెమట, ఫోన్‌ నుంచి వచ్చే రేడియేషన్‌ కవర్‌ను ఆక్సిడేషన్‌కు గురి చేస్తుంది. ఈ కారణంగానే ఫోన్‌ కవర్‌ యెల్లో కలర్‌లోకి మారుతుంది.

ఇలా క్లీన్‌ చేసుకోవచ్చు..

రంగు మారిన కవర్‌ మళ్లీ పాత రంగులోకి మారాలంటే రెండు నుంచి మూడు డ్రాప్స్‌ డిష్‌ వాష్‌ సోప్‌ను వేడి నీటిలో కలపాలి. అనంతరం పాత బ్రష్‌ను తీసుకొని ఫోన్‌ కవర్‌పై రుద్దాలి. అనంతరం నీటితో కడిగితే చాలు మళ్లీ పాత రంగులోకి వచ్చేస్తోంది. ఇక బేకింగ్ సోడాతో కూడా కవర్‌ రంగు మార్చుకోవచ్చు. బేకింగ్ సోడా వేసి కాస్త నీటిని యాడ్‌ చేసి బ్రష్‌తో క్లీన్‌ చేస్తే సరి.. కవర్‌ తళుక్కుమంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..