Watch Video: విజయానికి 16 పరుగులు.. నాటకీయ పరిణామాలతో నరాలు తెగే ఉత్కంఠ.. లాస్ట్ ఓవర్‌లో అద్భుత క్షణాలు మీకోసం..
India vs Pakistan Last Over In T20WC 2022: విరాట్ కోహ్లీ భారత్‌ను గెలిపించేందుకు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే చివరి ఓవర్ చాలా ఉత్కంఠభరితంగా సాగడంతో, అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠలో అద్భుత విజయం భారత్ సొంతమైంది.
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా తరపున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ 53 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ చివరి ఓవర్ చాలా ఉత్కంఠగా సాగింది. ఈ ఓవర్‌లో టీమ్ ఇండియా మొత్తం 16 పరుగులు చేసింది. పాకిస్థాన్ తరపున మహ్మద్ నవాజ్ ఈ ఓవర్ సంధించాడు. భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాక్ 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత్ 19వ ఓవర్‌కు 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. విజయం చివరి ఓవర్‌కు చేరుకుంది. ప్రపంచమంతా ఉత్కంఠగా ఈ ఓవర్‌నే చూస్తోంది. ఈ ఓవర్‌కు కోహ్లీ 74, పాండ్యా 40 పరుగులతో ఆడుతున్నారు. ఆ తర్వాత పాకిస్థాన్ చివరి ఓవర్‌ను మహ్మద్ నవాజ్‌కి ఇచ్చింది.
భారత ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో పాండ్యా స్ట్రయిక్స్ చేశాడు. ఈ ఓవర్ తొలి బంతికే బాబర్ అజామ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం దినేష్ కార్తీక్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్ రెండో బంతికి పరుగు తీసిన కార్తీక్.. కోహ్లీకి స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతికి రెండు పరుగులు తీసిన కోహ్లి తన వద్ద స్ట్రైక్‌ని కొనసాగించాడు.
మహ్మద్ నవాజ్ వేసిన ఓవర్ నాలుగో బంతి నో బాల్‌గా మారడంతో కోహ్లీ దానిపై సిక్సర్ బాదాడు. ఆ తర్వాత నవాజ్ తదుపరి బంతిని వైడ్‌గా విసిరాడు. నాలుగో బంతికి కోహ్లీ 3 పరుగులు చేయడంతో మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాడు. కానీ, మరుసటి క్షణం నుంచి మ్యాచ్ మరింత రంజుగా మారింది. ఆ ఓవర్ ఐదో బంతికి కార్తీక్ స్టంప్ అవుట్ అయ్యాడు. దీని తర్వాత చివరి బంతి మళ్లీ వైడ్ కాగా, అశ్విన్ విజయానికి ఒక పరుగు తీశాడు.
View this post on Instagram
భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ ఎలా సాగిందంటే..
1వ బంతికి హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్ అయ్యాడు.
2వ బంతి – కార్తీక్ ఒక పరుగు తీశాడు.
3వ బంతికి కోహ్లీ రెండు పరుగులు తీశాడు.
4వ బంతి – నో బాల్‌లో కోహ్లి సిక్సర్ కొట్టాడు.
4వ బంతి – వైడ్ బాల్
4వ బంతికి కోహ్లీ 3 పరుగులు తీశాడు.
5వ బంతి – కార్తీక్ స్టంప్ అవుట్.
6వ బంతి – వైడ్ బాల్
6 బంతికి అశ్విన్ ఒక పరుగు తీసి, భారత్‌కు విజయాన్ని అందించాడు.