AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganja: గంజాయిని ఆయుర్వేదంలో వినియోగించే వారని మీకు తెలుసా.. అంతే కాకుండా..

గంజాయి.. ఈ పేరు వింటేనే చాలు. చాలా మంది భయపడిపోతుంటారు. నిషేధిత మత్తు పదార్థంగా దీనిని అధికారులు గుర్తించారు. దేశంలో గంజాయి రవాణా చట్ట విరుద్ధం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు...

Ganja: గంజాయిని ఆయుర్వేదంలో వినియోగించే వారని మీకు తెలుసా.. అంతే కాకుండా..
Ganjai
Ganesh Mudavath
|

Updated on: Oct 23, 2022 | 4:47 PM

Share

గంజాయి.. ఈ పేరు వింటేనే చాలు. చాలా మంది భయపడిపోతుంటారు. నిషేధిత మత్తు పదార్థంగా దీనిని అధికారులు గుర్తించారు. దేశంలో గంజాయి రవాణా చట్ట విరుద్ధం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇయితే గంజాయిని గతంలో ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగించేవారని పలు గ్రంథాలు తెలుపుతున్నాయి. శాస్త్రీయ ఆయుర్వేద గ్రంథాల ప్రకారం హెర్బ్ దాని చికిత్సా స్వభావం కోసం ఉపయోగించారు. ఔషధ గంజాయిగా పిలవబడే జనపనార THC 0.3% లేదా అంతకంటే తక్కువ ఉన్న గంజాయికి సమానంగా ఉంటుంది. గంజాయిని శాస్త్రీయ ఆయుర్వేద గ్రంథాలలో ‘విజయ’గా కూడా ప్రస్తావించారు. గంజాయి వైద్యం లక్షణాలు, శ్వాసకోశ, జీర్ణ ఆరోగ్యం, చర్మం, జుట్టు, నాడీ వ్యవస్థ, నొప్పుల నివారిణ కోసం ఉపయోగించారు. దీనిని సాంస్కృతిక మూలికగా పేర్కొన్నారు.

గంజాయి మొక్క విత్తనాలను పోషకాహార సప్లిమెంట్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వాటిలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఒమేగా 3, 6, 9, OTC అధికం. గంజాయి మొక్క ఆకులను నేరుగా ఉపయోగిస్తారు. లేదా వివిధ గంజాయి ఆకులను ఔషధాలను తయారికీ ఉపయోగించేవారు. అయితే.. భారతదేశంలో మాత్రం గంజాయి ఆకులతో తయారు చేసిన ఔషధాన్ని ఇచ్చేందుకు ధృవీకరించబడిన ఆయుర్వేద వైద్యుడి ప్రిస్క్రిప్షన్ అవసరం. వైద్యం పరంగా గంజాయిలో ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. మంటను తగ్గించడానికి, దీర్ఘకాలిక నొప్పిని నివారించడానికి, మూర్ఛ, మానసిక రుగ్మతలను తగ్గించడంలో సహాయపడుతుంది,

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లేదా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఔషధంగా గాంజాయిని ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ చట్టాల ప్రకారం, ఔషధ ప్రయోజనాల కోసం రెగ్యులేటరీ బాడీ నుండి సేకరించిన గంజాయి NDPC చట్టం పరిధిలోకి రావు. కాబట్టి వాటిని ఆయుర్వేద ఔషధంగా ఉపయోగించవచ్చు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్, 1940 ప్రకారం, మెడిసినల్ గంజాయి ‘షెడ్యూల్ E1’ డ్రగ్ పరిధిలోకి వస్తుంది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.