AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facts: అసలు మనకు నవ్వు ఎందుకు వస్తుంది.? నవ్వు వెనకాల ఉన్న ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.?

భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా మనుషులందరిలో ఎమోషన్స్‌ సహజంగా ఉంటాయి. ఇలాంటి ఎమోషన్‌లో నవ్వు ఒకటి. కేవలం మనుషులకు మాత్రమే పరిమితమైన నవ్వును దేవుడిచ్చిన వరంగా భావిస్తుంటారు. నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం రోగం అనే సామె..

Facts: అసలు మనకు నవ్వు ఎందుకు వస్తుంది.? నవ్వు వెనకాల ఉన్న ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.?
Smile Facts
Narender Vaitla
|

Updated on: Oct 23, 2022 | 3:31 PM

Share

భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా మనుషులందరిలో ఎమోషన్స్‌ సహజంగా ఉంటాయి. ఇలాంటి ఎమోషన్‌లో నవ్వు ఒకటి. కేవలం మనుషులకు మాత్రమే పరిమితమైన నవ్వును దేవుడిచ్చిన వరంగా భావిస్తుంటారు. నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం రోగం అనే సామెత ఉండనే ఉంది. నవ్వలేకపోవడం ఒక రోగమని దీని అర్థం. సినిమా విజయాల్లో కామెడీ కీలక పాత్ర పోషిస్తుందంటేనే ఈ ఎమోషన్‌కి మనిషి ఎంతలా అట్రాక్ట్ అవుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇంతకీ మనిషి ఎందుకు నవ్వుతాడు.? దీని వెనకాల ఉన్న శాస్త్రీయ కారణం ఏంటన్న ఆసక్తికర విషయాలు మీకోసం..

మనం చేసే ప్రతీ పనికి మన మెదడే కీలకమనే విషయం తెలిసిందే. మెదడు ఇచ్చే సంకేతాల ఆధారంగానే మనం పనులు చేస్తుంటాం. మన నవ్వుకు కూడా మెదడే కారణం. ఏదైనా జోక్‌ విన్నా, నవ్వుకునే సంఘటనను చూసిన మెదడులోని ఓ నాడీ ప్రేరేపితమవుతుంది. మెదడులో ఉండే భాగాల్లో ఒకటి మొహంలోని నవ్వు తాలుకూ భాగాన్ని, మరొకటి నవ్వు శబ్దాన్ని ప్రేరేపిస్తాయి. ఈ కారణంగానే మన కంట్రోల్‌లో లేకుండానే బిగ్గరగా నవ్వేస్తాం.

నవ్వు ఎందుకు వస్తుందో తెలుసుకున్నాం కదా.. మరి నవ్వు వల్లే కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందామా.? నిత్యం నవ్వడం వల్ల ఒత్తిడి బలదూర్‌ అవుతుంది. నవ్వడం వల్ల మీ మూడ్‌ మారడమే కాకుండా మీ పక్కన వారి మూడ్‌ను కూడా మార్చొచ్చు. ప్రతీ రోజూ నవ్వడం వల్ల రోగ నిరధోక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నవ్వడం వల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. నవ్వడం వల్ల మొహంలో అవయవాలన్నీ కదులుతాయి. దీనివల్ల యవ్వనంగా కనిపిస్తాము.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..