AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: మీకు షుగర్‌ ఉందా.. అయితే మీ కిడ్నీలు ప్రమాదంలో పడినట్లే.. ఈ టిప్స్‌తో బయటపడండిలా..

Diabetes: ఈ మధ్య కిడ్నీలు ఫెయిల్‌ అవుతున్న ఘటనలు చాలానే జరుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం డయాబెటిస్.. ఎందుకంటే ఈ వ్యాధి వల్ల మూత్రపిండాలు చెడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది...

Diabetes: మీకు షుగర్‌ ఉందా.. అయితే మీ కిడ్నీలు ప్రమాదంలో పడినట్లే.. ఈ టిప్స్‌తో బయటపడండిలా..
Srinivas Chekkilla
|

Updated on: Mar 16, 2022 | 6:31 PM

Share

ఈ మధ్య కిడ్నీ(Kidneys)లు ఫెయిల్‌ అవుతున్న ఘటనలు చాలానే జరుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం డయాబెటిస్(Diabetes).. ఎందుకంటే ఈ వ్యాధి వల్ల మూత్రపిండాలు చెడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.షుగర్ ఉన్నవారికి మూత్రపిండాల సమస్య కూడా ఎక్కువగా కనిపిస్తూనే ఉన్నాయి. కిడ్నీలు మన శరీరంలోని వ్యర్థాలను, ట్యాక్సిన్లను ఫిల్టర్ చేసి వాటిని మూత్రం గుండా శరీరం నుంచి బయటకు పంపుతాయి. అంతేకాదు ఇది రక్తపోటు(BP)ను కూడా నియంత్రిస్తుంది. కొన్ని సందర్భాల్లో మన శరీరానికి అవసరమైన హార్మోన్లలను కూడా ఉత్పత్తి చేస్తాయి. అయితే మూత్రపిండాలు చెడిపోయినప్పుడు ఇదంతా జరగదు. దీంతో వారు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితిత ఏర్పడుతుంది.

డయాబెటిస్ వ్యాధి బారిన పడటం వల్ల వారి శరీరంలో ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాదు. ఈ ఇన్సులిన్ వల్లే మన రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇక మధుమేహుల్లో ఈ ఇన్సులిన్ తగినంతగా ఉత్పత్తి కాక శరీరంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో వారి శరీరంలో ఉండే చిన్న చిన్న రక్త నాళాలు దెబ్బతింటాయి. అంతేకాదు దీంతో వివిధ అవయవాలు సరిగ్గా పనిచేయవు. ఇది కిడ్నీలను కూడా దెబ్బతీస్తుంది. దీనివల్ల టాక్సిన్లను బయటకు పంపే ప్రాసెస్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల నరాలు కూడా దెబ్బతింటాయి. కొంతమందికైతే.. మూత్రంపోయడం కూడా కష్టతరం అవుతుంది. మూత్రాన్ని ఖాళీ చేయకపోవడం వల్ల మూత్రపిండంపై ఒత్తిడి పడి యూరినరీ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.

కిడ్నీలను ఇలా రక్షించుకోండి

1.మధుమేహం వల్ల కిడ్నీ దెబ్బతినకూడదంటే.. వారి రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.

2.ఒకవేళ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సోకితే.. వెంటనే వైద్యులను సంప్రదించి వారి సూచనలను, సలహాలను తప్పకుండా పాటించాలి.

3.అధిక రక్తపోటు సమస్య రాకుండా జాగ్రత్త పడాలి.

4. పొగాకుకు దూరంగా ఉండాలి. దీన్ని నమలడం, స్మోకింగ్ చేయడం మానుకోవడం ఉత్తమం.

5. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడకూడదు.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Read Also..Health News: బీపీ విషయంలో జాగ్రత్త.. వయసు ప్రకారం స్త్రీలు, పురుషులలో ఎంత ఉండాలంటే..?